భారీ పేలుడు : 125 మంది మృతి
అజర్ బైజాన్‌లో జరిగిన పేలుడు ఘటనలో 125 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
అజర్ బైజాన్‌లో జరిగిన పేలుడు ఘటనలో 125 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే 125కు మృతుల సంఖ్య చేరడంతో సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం ఇరవై మంది చనిపోయినట్లు మాత్రమే అధికారులు తెలిపారు. ఆ తర్వాత అంతకంతకూ పెరిగి 125కు చేరుకుంది. అజర్ బైజాన్‌లోని నాగర్నో-కరాబాఖ్‌లోని పెట్రోల్ బంక్ లో ఈ పేలుడు సంభవించింది. పెట్రోలు నింపుకుంటుండగా ఈ పేలుడు జరగడంతో పెద్దసంఖ్యలో మరణించారని అధికారులు తెలిపారు.
క్యూలో ఉండగా...
పెట్రోలు కొట్టించుకునేందుకు తమ వాహనాలతో క్యూలో నిల్చుని ఉండగా పేలుడు సంభవించడంతో ఎటూ తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ ఘటనలో వంద మందికి పైగానే గాయపడినట్లు తెలిసింది. ప్రస్తుతం వందల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు చెబుతున్నారు. సహాయక చర్యలు వెంటనే చేపట్టినా మృతుల సంఖ్య మాత్రం భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. పేలుడు ధాటికి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.