పొడిచేశాక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.. కత్తికి అంటిన రక్తాన్ని తుడిచేశాడు

చెన్నై ఆసుపత్రిలో డాక్టర్ పై విఘ్నేష్ కత్తిదాడి చేసి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లిన ఘటన ఉద్రిక్తత కలిగించింది.

Update: 2024-11-13 16:07 GMT

చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంకాలజిస్ట్‌ను పలుమార్లు కత్తితో పొడిచిన వ్యక్తి నేరం చేసిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. కలైంజ్ఞర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో డాక్టర్ బాలాజీ జగన్నాథన్ ను సదరు వ్యక్తి పలు మార్లు కత్తితో దాడి చేశాడు. బాలాజీ ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక మహిళ కుమారుడే నిందితుడు. నిందితుడు విఘ్నేష్ కత్తితో దాడి చేసిన తర్వాత కత్తిని పట్టుకుని, దానిని తుడిచేశాడు. ఆ తర్వాత దానిని తన కుడి వైపున దాచి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లి కత్తిని విసిరేయడం వీడియోలో రికార్డు అయింది. విఘ్నేష్ పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

సెక్యూరిటీ సిబ్బందితో అతడు వాగ్వాదానికి దిగడం కూడా వీడియోలో ఉంది. చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నప్పుడు గార్డులు విఘ్నేష్ ను పట్టుకోవడం చూడవచ్చు. కొందరు యువకుడిని కొట్టడం ప్రారంభించినప్పుడు, ఒక మహిళ జోక్యం చేసుకుని వారిని ఆపింది. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.
డాక్టర్ జగన్నాథ్ ప్రఖ్యాత ఆంకాలజిస్ట్, కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉపాధ్యాయుడు. విఘ్నేష్ ఔట్ పేషెంట్ గదిలో డాక్టర్‌ను పలుమార్లు కత్తితో పొడిచాడు. తన తల్లికి వైద్యుడు తప్పుడు మందులు రాశాడనే అనుమానంతో డాక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో డాక్టర్ జగన్నాథ్‌కు ఏడు కత్తిపోట్లు అయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతను స్థిరంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు.




Tags:    

Similar News