ఘోర బస్సుప్రమాదం.. 17 మంది మృతి

కాలువ గోడను బస్సు ఢీ కొట్టడంతో.. ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు..;

Update: 2023-03-19 11:29 GMT
bangladesh bus accident, 17 killed in bus accident

 17 killed in bus accident

  • whatsapp icon

బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న బస్సు అదుపుతప్పి కాలువలో పడి.. గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మదారిపూర్‌లోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం తాలూక వివరాలిలా ఉన్నాయి. సోనాదంగా నుంచి ఢాకాకు ఓ బస్సు ప్రయాణికులతో బయల్దేరింది. ఉదయం 7.30 సమయంలో మదారిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌ వేపై అదుపుతప్పి కాలువలోకి వేగంగా దూసుకెళ్లింది.

కాలువ గోడను బస్సు ఢీ కొట్టడంతో.. ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానిక ప్రజలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, బస్సులో మెకానికల్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సు వేగంగా రావడంతో టైర్ పగిలిపోయిందని, డ్రైవర్ బస్సుపై పట్టు కోల్పోవడంతోనే కాలువలో పడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News