సైబర్ అటాక్.. పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ లో కొత్త రకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీని తమ పరం చేసుకునేందుకు ఉద్యోగులే కంపెనీ పై సైబర్ దాడులకు పాల్పడ్డారు
హైదరాబాద్ లో కొత్త రకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీని తమ పరం చేసుకునేందుకు ఉద్యోగులే కంపెనీ పై సైబర్ దాడులకు పాల్పడ్డారు. హాంగర్ టెక్నాలజీ సంస్థపై ఆ కంపెనీ ఉద్యోగులు దాడి చేసి డేటాను చేజిక్కించుకున్నారు. గత కొంతకాలంగా సైబర్ అటాక్ చేస్తూ వచ్చారని కంపెనీ యాజమాన్యం గుర్తించింది.
ఉద్యోగులే...
కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు ఈ దాడికి పాల్పడ్డారు. దీంతో హాంగర్ టెక్నాలజీ కంపెనీ యాజమాన్యం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీకి సంబంధించి అందాగ్ విజయ్ కుమార్, కరణ్ కుమార్, అశ్వంత్ కుమార్ లతో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రివాల్వర్ తో పాటు పది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అమెరికాలో ఉండటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.