Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించారు.;
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారు జరిగిన ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై నిద్రిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ట్రక్కు ఢీకొన్న ఘటనలో మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అతి వేగమే...
అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. అదుపుతప్పి లారీ ఫుట్ పాత్ పైకి దూసుకు రావడంతోనే నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే మరణించారు. గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడగా, వారిని ఆసపత్రికి తరలించారు. మృతి చెందిన వారంతా తమిళనాడు వాసుల్లాగా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను, క్లీనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
.