50 మంది గల్లంతు : కొనసాగుతున్న రెస్క్కూ ఆపరేషన్
మలేసియా లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి యాభై మంది గల్లంతయ్యారు
మలేసియా లో ఘోర ప్రమాదం జరిగింది. కౌలాలంపూర్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఒక క్యాంప్ పై కొండ చరియలు పడి ఇద్దరు మరణించారు. యాభై మంది వరకూ గల్లంతయ్యారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో అధికారులకు సమాచారం చేరడానికి ఆలస్యమయింది. రెస్క్కూ ఆపరేషన్ మొదలయిందని, యాభై మంది ఆచూకీని కనుగొంటున్నామని అధికారులు తెలిపారు. క్యాంప్ లో 79 మంది ఉండగా, అందులో 23 మంది మాత్రమే సురక్షితంగా ఉన్నారని, వీరిలో కార్మికులు అధికంగా ఉన్నారని తెలిపారు.
కొండ చరియలు విరిగిపడి...
ఈరోజు తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు వంద అడుగుల ఎత్తు నుంచి విరిగిపడటంతో ఎక్కువ మంది గల్లంతయ్యారని చెబుతుననారు. ఎకరం విస్తీర్ణం కలిగిన క్యాంప్ లో ఈ కొండచరియలు విరిగిపడ్డాయి. ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా వేల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రెస్క్కూ ఆపరేషన్ ను కొనసాగుతుందని, గల్లంతయిన వారి ఆచూకీని కనుగొంటామని అధికారులు వెల్లడించారు.