Breaking : భార్యను హత్య చేసి.. చికిత్స కోసం అంటూ ఆసుపత్రికి తీసుకు వచ్చి?

భార్యను చంపిన భర్త హసన్ ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కోసం తీసుకు వచ్చానని నమ్మబలికాడు.;

Update: 2024-08-10 12:08 GMT
vikarabad murder

vikarabad murder

  • whatsapp icon

ఆసిఫ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపిన భర్త ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కోసం తీసుకు వచ్చానని నమ్మబలికాడు. అయితే అప్పటికే ఆమె మరణించడంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసిఫ్ నగర్ లో నివాసముంటున్న హసన్ తన భార్య మీద అనుమానంతో హత్య చేశాడు.

చెత్తకుండీలో దొరికిందని...
ఉస్మానియా ఆసుపత్రికి తీసుకు వచ్చాడు. చికిత్స కోసం తీసుకు వచ్చానని, చెత్తకుండీలో ఈ బాడీ దొరికిందని వైద్యులకు చెప్పపోయాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేశారు. హసన్ హత్య చేసి భార్య మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకు వచ్చాడని గుర్తించిన పోలీసులు హసన్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News