వ్యభిచార గృహంపై మెరుపుదాడి..

రోడ్ నంబర్ 2,3 ల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పక్కా సమాచారం రావడంతో అధికారులు..;

Update: 2022-11-11 04:27 GMT
kukatpally brothal house, human traficking police

kukatpally brothal house

  • whatsapp icon

హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం మెరుపుదాడి చేసింది. రోడ్ నంబర్ 2,3 ల మధ్యలో ఉన్న ఓ ఇంట్లో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పక్కా సమాచారం రావడంతో అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. దాడి సమయంలో అక్కడున్న విటుడు, యువతితో పాటు.. అక్కడే పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారయ్యాడు. అదుపులోకి తీసుకున్న ముగ్గురినీ.. కేపీహెచ్ బీ పోలీసులకు అప్పగించగా.. యువతిని రెస్క్యూ హోమ్ కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వ్యభిచార గృహ నిర్వాహకుడి కోసం గాలిస్తున్నారు.







Tags:    

Similar News