విశాఖపట్నంలో బెంగాల్ విద్యార్థిని మృతి.. అరెస్ట్ చేసింది వీళ్లనే..!

విశాఖపట్నంలో బెంగాల్ విద్యార్థిని రితీ సాహా అనమానాస్పద మృతి కేసును

Update: 2023-09-02 02:29 GMT

విశాఖపట్నంలో బెంగాల్ విద్యార్థిని రితీ సాహా అనమానాస్పద మృతి కేసుపై బెంగాల్ పోలీసులు కూడా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం మమతా బెనర్జీ ఆదేశాలతో బెంగాల్ పోలీసులు విశాఖకు వచ్చి విచారణ చేశారు. రితీ సాహా అనుమానాస్పద మృతి కేసును విశాఖ పోలీసులు చేధించారు. కాలేజ్‌ యాజమాన్యం, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే రితీ సూసైడ్‌కు కారణమని తేల్చారు విశాఖ పోలీసులు. కేసులో సెక్షన్స్ మార్చి బైజూస్, హాస్టల్‌ సిబ్బందిని అరెస్ట్ చేశారు. రితీ సాహ ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడడంతో మృతిచెందినట్టు పేర్కొంటూ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు మొదట కేసు నమోదుచేశారు. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతికి బైజూస్‌-ఆకాశ్‌ యాజమాన్యం, హాస్టల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

బైజూస్ సిబ్బంది, హాస్టల్ వార్డన్‌ అరెస్ట్ చేసిన పోలీసులు.. యాజమాన్యం నిర్లక్ష్యమే రితీ ఆత్మహత్యకు కారణమని నిర్ధారించారు. బైజూస్ మేనేజర్ రాజేశ్వర్ రావ్, ఆపరేషన్స్ హెడ్ రవికాంత్‌, సాధన హాస్టల్ యజమాని సూర్య కుమారి, వార్డెన్ గన్ను కుమారిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఈ కేసులో సెక్షన్‌ 174 నుంచి సెక్షన్‌ 304- పార్ట్ 11కి కేసు మార్పు చేశారు. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రితీసాహా జూలై 14న విశాఖపట్టణంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. విశాఖలోని ఆకాష్ బైజూస్‌లో నీట్ కోచింగ్ తీసుకుంటూ నరసింహనగర్ లో ఉన్న సాధనా హస్టల్‌లో ఉంటుంది. ఈ క్రమంలో హస్టల్ భవనం నాలుగో అంతస్తుపై నుంచి పడి రీతీసాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విశాఖపట్టణం పోలీసుల తీరుపై మృతురాలి తండ్రి సుఖ్ దేవ్ అనుమానాలు వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో ఆమె ఆదేశాలతో కోల్‌కతా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. బెంగాల్ పోలీసులు విశాఖకు వచ్చి విచారణ జరుపుతున్న సమయంలో వైజాగ్ పోలీసులు కీలక అరెస్టులు చేశారు.


Tags:    

Similar News