విశాఖలో ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠా.. రూ.400 కోట్లా!!
విశాఖలో అంతర్జాతీయ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన
విశాఖలో అంతర్జాతీయ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారి నుండి సమాచారం సేకరించిన పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ అరెస్టులపై డీసీపీ కంచి శ్రీనివాసరావు స్పందించారు. ఈ ముఠాలో వాసుదేవరావు, దినేశ్ అలియాస్ మోను ప్రధాన నిందితులని.. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ ఆదేశాల మేరకు బెట్టింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
యువతను టార్గెట్ గా చేసుకుని ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఏకంగా రూ.400 కోట్ల లావాదేవీలు జరిపిన అంతర్జాతీయ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 11మంది బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు కంచి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ పోలీస్ కమీషనర్ రవిశంకర్ అయ్యనార్ ఆదేశాల మేరకు ఈ బెట్టింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తాను బెట్టింగ్ లో మోసపోయినట్లు ఎర్ర సత్తిబాబు అనే వ్యక్తి పిటిషన్ ఇచ్చాడు. ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సిపి రవిశంకర్ దర్యాప్తుకు ఆదేశించారు. బాధితుడు సత్తిబాబు బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీల ఆధారంగా ఈ డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్లాయో గుర్తించారు. సూరిబాబు అనే బుకీ ఖాతాకు సత్తిబాబు ఎనిమిది లక్షల రూపాయలు పంపించినట్లు తేలింది. సూరిబాబు బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ఎవరికి వెళుతున్నాయో లోతుగా దర్యాప్తు చేపట్టగా ఈ బెట్టింగ్ ముఠాలో అసలు సూత్రదారుల వివరాలు బయటపడ్డాయి.