కారులో మోడల్ పై అత్యాచారం.. మహిళ సహా నలుగురి అరెస్ట్

ఇంటి వద్ద దింపకుండా రాత్రంతా కారును పట్టణం చుట్టూ తిప్పుతూ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ..;

Update: 2022-11-19 08:47 GMT
gang assault on model, kochi model gang rape

gang assault on model

  • whatsapp icon

కామాంధులు బరితెగించారు. మద్యం సేవించి ఉన్న మోడల్ పై నడుస్తున్న కారులో సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో గురువారం (నవంబర్ 17) రాత్రి జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. 19 ఏళ్ల మోడల్ కొచ్చిన్ షిప్ యార్డ్ సమీపంలోని ఓ పబ్ కు వెళ్లింది. అక్కడ ఆమె మద్యం సేవించింది. అదే అవకాశంగా భావించిన కొందరు యువకులు.. ఆమెను తమ కారులో కక్కనాడ్ లోని తన ఇంటివద్ద దిగబెడతామని చెప్పి ఎక్కించుకున్నారు.

ఇంటి వద్ద దింపకుండా రాత్రంతా కారును పట్టణం చుట్టూ తిప్పుతూ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రూమ్ వద్ద వదిలి వెళ్లిపోయారు. స్థానికులు ఆమెను కలమసెర్రి మెడికల్ ఆస్పత్రికి తరలించారు. మోడల్ కు వైద్యం చేసిన సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతికి గాయాలైనట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి వీణా చార్జ్ ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.




Tags:    

Similar News