ఉపాధ్యాయుడికి చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు(video)

పాఠశాలలో ఉపాధ్యాయుడి నుంచి తమకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి తల్లిదండ్రులకు చెప్పారు. ఆగ్రహానికి గురైన బాలిక..;

Update: 2022-10-21 12:56 GMT
school girls assault by teacher, uttarpradesh

school girls assault by teacher

  • whatsapp icon

పాఠశాలలో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి మహిళలు చెప్పులతో దేహశుద్ధి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో.. మహిళలు టీచర్‌ను బూట్లు, చెప్పులతో కొట్టడం కనిపిస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. అజంగఢ్‌ లోని ఫుల్‌పూర్ పోలీసు పరిధిలోని సరాయ్ ఖుర్ద్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పాఠశాలలో ఉపాధ్యాయుడి నుంచి తమకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి తల్లిదండ్రులకు చెప్పారు. ఆగ్రహానికి గురైన బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని చెప్పులతో కొట్టారు. తరగతిలో ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడని, తమను అనుచితంగా తాకాడని బాలికలు ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పూల్పూర్ పోలీసులు పాఠశాలకు చేరుకుని నిందితుడిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశారు. తమకు జరిగిన దారుణాన్ని బాలికలు పోలీసుల ముందు బయటపెట్టారు.


Tags:    

Similar News