సినీనటుడు నరేష్ హత్యకు కుట్ర..రెక్కీ.. పదికోట్ల డీల్

సినీనటుడు నరేష్ ను చంపడానికి కుట్ర జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు

Update: 2023-01-27 05:15 GMT

సినీనటుడు నరేష్ ను చంపడానికి కుట్ర జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సినీనటుడు కృష్ణ మరణించినప్పుడు నరేష్ ఇంటివద్ద రెక్కీ జరిగినట్లు కూడా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియోలను కూడా నరేష్ బయటపెట్టారు.

పది కోట్ల డీల్...
నరేష్ ఇటీవల పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. మాజీ భార్య రమ్య రఘుపతి నరేష్ ను చంపేందుకు పది కోట్ల డీల్ జరిగినట్లు చెబుతున్నారు. ఒక పోలీసు అధికారి సాయంతో హత్యకు కుట్ర పన్నారని, తనకు ప్రాణహాని ఉందని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కర్ణాటక చెందిన రాకేష్ శెట్టితో పది కోట్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారని నరేష్ తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని నరేష్ కోరుతున్నారు.


Tags:    

Similar News