ఆ ఇన్నోవా... ఆయనదే.. నిర్ధారించిన పోలీసులు

జూబ్లీ హిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు సంచలనం సృష్టించింది. ఇందులో ఆరుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2022-06-08 13:00 GMT

జూబ్లీ హిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు సంచలనం సృష్టించింది. ఇందులో ఆరుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితులు వినియోగించిన ఇన్నోవా కారుపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆ ఇన్నోవా కారు ఎవరిది? ఎక్కడి నుంచి మైనర్లు తీసుకు వచ్చారన్నది పోలీసులు బయటపెట్టలేదు. అయితే ఈ ఇన్నోవా కారు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుటుంబానిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

దినాజ్ పేరుతో....
వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుటుంబానికి చెందిన దినాజ్ పేరుతో ఈ ఇన్నోవా రిజిస్టర్ అయింది. కారును వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుటుంబమే కొనుగోలు చేసింది. ఏడాదిన్నరగా వాహనాన్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ నెల 28వ తేదీన పబ్ కు డ్రైవర్ తో ఈ కారులో వక్ఫ్ బోర్డుఛైర్మన్ కుమారుడు వెళ్లినట్లు కూడా పోలీసులు నిర్థారించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వాహన యజమానులపై కేసులు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News