లుంగీలు, దుప్పట్లు, 20 అడుగుల గోడ.. ఖైదీలు ఎలా పారిపోయారంటే?

అర్థరాత్రి వీరంతా పారిపోవడంతో జైలు అధికారులు, స్థానిక అధికారులు;

Update: 2024-10-12 07:39 GMT
Assam, AssamJailBreak, JailBreak, Assam prisonbreak, Assam prisonbreak 5 inmates climb 20-foot wall using lungis, blankets bedsheets, latest assam jail break news today

Assam prisonbreak

  • whatsapp icon

ఐదుగురు ఖైదీలు శుక్రవారం రాత్రి అస్సాంలోని మోరిగావ్ జిల్లా జైలు నుంచి తప్పించుకున్నారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసులో ఈ ఖైదీలు నిందితులుగా ఉన్నారు. ఖైదీలు లుంగీలు, దుప్పట్లు, బెడ్‌షీట్‌లను ఉపయోగించి 20 అడుగుల జైలు గోడను దాటేశారు. వీరిని పట్టుకోడానికి జిల్లా అంతటా అధికారులు జల్లెడ పడుతూ ఉన్నారు.

పారిపోయిన వారిని సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్‌లుగా గుర్తించారు. వీరంతా పోక్సో సంబంధిత నేరాలకు పాల్పడుతున్నారు. అర్థరాత్రి వీరంతా పారిపోవడంతో జైలు అధికారులు, స్థానిక అధికారులు ఉదయాన విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. పారిపోయిన వారిని తిరిగి పట్టుకోవడానికి అధికారులు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించారు. ఆ ప్రాంతం అంతటా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఖైదీలు ఎలా తప్పించుకోగలిగారో తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.
Tags:    

Similar News