Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు కేసులు సీఐడీకి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు కేసులను ఏపీ సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది

Update: 2024-10-13 04:56 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు కేసులను ఏపీ సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి కేసును సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్యాలయంపై గత ప్రభుత్వ హయాంలో దాడులు జరిగాయి. కొన్ని వాహనాలతో పాటు ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. ఈ కేసును మంగళగిరి పోలీసుల నుంచి సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టయ్యారు.

చంద్రబాబు నివాసంపై...
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసును కూడా ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ నేత జోగి రమేష్ తన అనుచరులతో కలసి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి యత్నించారని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ కేసులో మంగళగిరి పోలీసుల ఎదుటకు జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కేసును కూడా సీఐడీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News