కేరళ నరబలి కేసులో షాకింగ్ ట్విస్ట్.. నరసమాంసం వండుకుని తినేశారు !

క్షుద్రపూజలు చేసే మహ్మమద్‌ షఫీ వద్ద పద్మ మొబైల్ ఫోన్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అతడిని అరెస్ట్ చేసి..;

Update: 2022-10-13 12:13 GMT
kerala crime news, kerala couple kills two women, black magic

kerala human sacrifice case

  • whatsapp icon

కేరళలో ఇద్దరు మహిళలను నరబలి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా ఈ కేసులో ఓ షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. ఒక మహిళను ముక్కలు ముక్కలుగా నరికి.. వండుకుని తినేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పతనంతిట్ట జిల్లా ఎలంతూరు గ్రామంలో జరిగిందీ ఘటన. జూన్‌ నెలలో రోసెలిన్‌ అనే మహిళ, సెప్టెంబర్ పద్మ అనే వృద్ధురాలు అదృశ్యమయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు మిస్సింగ్ కేసులు పెట్టడంతో.. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో క్షుద్రపూజలు చేసే మహ్మమద్‌ షఫీ వద్ద పద్మ మొబైల్ ఫోన్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అతడిని అరెస్ట్ చేసి.. ఇద్దరు మహిళల మిస్సింగ్ గురించి ఆరా తీయగా.. విస్తుపోయే నిజాలు వెల్లడించారు. రోసెలిన్, పద్మలతో షఫీ సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ఇద్దరినీ లోబరుచుకుని, డబ్బులు ఆశ చూపి మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేశాడు. అప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతోన్న భగవాల్ సింగ్, లైలా దంపతుల ఇంటికి మహిళలను విడివిడిగా పంపాడు.
నరబలి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి.. ఐశ్వర్యం వస్తుందని వారిని నమ్మించాడు. మహిళల చేతులు కట్టేసి.. క్షుద్రపూజలు చేశారు. అనంతరం ప్రైవేట్ శరీర భాగాల్లో కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. హత్యల అనంతరం వారు మృతదేహాల్ని ఖననం చేయలేదు. నిందితురాలైన లైలా.. ఓ మహిళ మాంసాన్ని వండగా.. ముగ్గురూ దానిని తినేశారు. మరో మహిళ మాంసాన్ని ఉప్పులో ఉంచి నిల్వ చేశారు. భగవాల్ సింగ్ ఇంటి ప్రాంగణంలో మూడు చోట్ల గోతిలో పాతి పెట్టిన ఇద్దరు మహిళల శరీర భాగాలను వెలికి తీసి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నరమాంసాన్ని తిన్నట్లు తెలిసినప్పటి నుంచి స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News