అనకాపల్లి బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతికి కారణమిదే

అనకాపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.;

Update: 2025-04-13 11:55 GMT
fire broke out, crackers, eight people died, anakapalle
  • whatsapp icon

అనకాపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. జిల్లాలోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడ మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. గాయపడిన వారకిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మరికొందరిని విశాఖ కేజీహెచ్ కు తరలిస్తున్నారు.

సామర్లకోటకు చెందిన వారిగా...
మృతులు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారిగా గుర్తించారు. మృతులను అప్పికొండ తాతబాబు, సంతరాతి గోవింద్, దాడి రామలక్ష్మి, దేవర నిర్మల, పురం పాప, గంపిన వేణుబాబు, శానవెల్లి బాబూరావు, చదలవాడ మనోహర్ లు గా గుర్తించారు. వీరు బాణసంచా కేంద్రం తయారీలో పనిచేయడానికి వచ్చి మరణించారని పోలీసులు ప్రాధమికంగా తెలిపారు. కోటరవుట్ల మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం బాణాసంచా తయారు చేస్తున్నప్పుడు మంటలు చెలరేగడంతో పెద్దయెత్తున పేలుడు జరిగిందని తెలిపారు. పేలుడు దెబ్బకు ఆ ఇల్లు కుప్పకూలి పోయిందన్నారు.
పేలుడు జరిగిన సమయంలో...
పేలుడు జరిగిన సమయంలో మొత్తం అక్కడ పదిహేను మంది కార్మికులు పనిచస్తున్నారు. ఇక్కడ బాణాసంచాలు తయారు చేయడం ఎన్నోఏళ్ల నుంచి వస్తున్నప్పటికీ సరైన నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. పనిచేస్తున్న కార్మికుల భద్రతకు యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రాధమికంగా నిర్ణయించారు. ఇక్కడ తయారయ్యే తారాజువ్వలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దయెత్తున కొనుగోలు చేస్తుంటారని చెబుతున్నారు. గాయపడిన వారిలోమరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.



















Tags:    

Similar News