నిజామాబాద్ లో ఎంబీబీఎస్ విద్యార్థి బలవన్మరణం
అతను రాబోయే పరీక్షలకు సన్నాహకంగా తెల్లవారుజామున 2 గంటల వరకు తన సహచరులతో కలిసి చదువుతున్నాడు.;

nizamabad medico harsha suicide
ఇటీవల వరంగల్ కాకతీక మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ప్రీతి కేసులో పూర్తి వివరాలు తెలియకముందే.. మరో వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న హర్ష.. తన హాస్టల్ గదిలో అనూహ్య రీతిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు.
మృతుడి స్వస్థలం మంచిర్యాల జిల్లా జిన్నారం. హర్ష చాలా మెరిట్ స్టూడెంట్ అని తోటి విద్యార్థులు తెలిపారు. అతను రాబోయే పరీక్షలకు సన్నాహకంగా తెల్లవారుజామున 2 గంటల వరకు తన సహచరులతో కలిసి చదువుతున్నాడు. అనంతరం తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. హాస్టల్ కు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హర్ష మరణంపై అతని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. మెరిట్ విద్యార్థి అయిన హర్ష ఏ కారణాల వల్ల బలవన్మరణానికి పాల్పడి ఉంటాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, స్నేహితులను విచారిస్తున్నారు.