కొత్త జంట.. ప్రాణం తీసిన హనీమూన్ ట్రిప్
కొత్త జంట.. ప్రాణం తీసిన హనీమూన్ ట్రిప్ హనీమూన్ కు వెళ్లిన నవ దంపతులు.. సముద్రంలో పడి
తమిళనాడుకు చెందిన నవ దంపతుల హనీమూన్ ట్రిప్ విషాదంగా మారింది. పూనమల్లికి చెందిన డాక్టర్ దంపతులు తమ హనీమూన్ కోసం బాలికి వెళ్లారు. వారు వాటర్ బైక్‌పై వెళుతుండగా, ఫోటోషూట్ సందర్భంగా నీటిలో మునిగి చనిపోయారు. లోకేశ్వరన్, విభూష్నియా జంటకు జూన్ 1న పూనమల్లిలోని ఒక కళ్యాణమండపంలో వివాహం జరిగింది. పెళ్లి అయ్యాక హనీమూన్ కు వెళ్లగా.. అక్కడ ఊహించని ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న విబుష్నియా తండ్రి సెల్వం, బంధువులు ఇండోనేషియా వెళ్లారు. శుక్రవారం లోకేశ్వరన్ మృతదేహం లభించగా, శనివారం ఉదయం విబుష్నియా మృతదేహం లభ్యమైంది.
ఇండోనేషియాకి హనీమూన్ కోసం వెళ్లిన నవ దంపతులు ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయారు. జూన్ 9వ తేదీన సముద్రంలో బోటు షికారుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడింది. దీంతో నవదంపతులిద్దరూ సముద్రంలో పడి చనిపోయారు. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు వెంటనే గాలించగా లోకేశ్వరన్ మృతదేహం దొరికింది. శనివారం నాడు విభూషిణియా మృతదేహం దొరికింది. ప్రమాదంపై దంపతుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఇండోనేషియా నుంచి ఈ దంపతుల మృతదేహానులను చెన్నైకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
దంపతులిద్దరూ స్పీడ్ బోట్ రైడ్‌కు ప్లాన్ చేసుకున్నారని, ఆ సమయంలో పడవ బోల్తా పడడంతో విషాదకరంగా మారిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనకు దారితీసిన ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాలను చెన్నైకి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండోనేషియాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా సహాయాన్ని కోరారు. ఇండోనేషియా నుంచి చెన్నైకి నేరుగా విమానాలు లేకపోవడంతో మృతదేహాలను తమిళనాడుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ఘటనతో విబుష్నియా కుటుంబం నివాసం ఉంటున్న సెన్నెర్‌కుప్పం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివాహాన్ని గుర్తుచేసుకుని.. ఇంతలోనే ఆ జంటను మాకు దూరం చేశాడు ఆ దేవుడు అంటూ బాధపడ్డారు. నవ దంపతుల అకాల మరణం కుటుంబ సభ్యుల్లోనూ, బంధువుల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.