లోయలో పడిన ఆటో.. ఒకరి మృతి.. పదిహేడు మందికి గాయాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్దెనిమిది మందితో వెళ్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడింది.;

Update: 2024-05-27 12:57 GMT
accident, truck, five people died, madhya pradesh
  • whatsapp icon

పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్దెనిమిది మందితో వెళ్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా పదిహేడు మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడిన వారిని...
ప్రమాదం గురించి తెలిసిన స్థానికులు.. వెంటనే అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. లోయలోకి దిగి గాయపడిన వారిని బయటకు తీశారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆటోలో ప్రమాదానికి లోనైన వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేేస్తున్నారు.


Tags:    

Similar News