Road Accident : ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

Update: 2024-12-21 01:56 GMT

ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. జిల్లాలోని మడకశిర మండలం బుళ్ల సముద్రం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారు జామున ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ను జాతీయ రహదారిపై ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు.


అతి వేగం.. నిద్రమత్తు కారణంగానే...

వెంటనే గాయపడిన వారిని బెంగళూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. మినీ వ్యాన్ లో ప్రమాదం జరిగిన సమయంలో పథ్నాలుగు మంది ఉన్నారు. మృతులందరూ గుడిబండ, అమరాపురం మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగం, నిద్రమత్తు వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పో్స్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





Tags:    

Similar News