వరంగల్‌లో రౌడీ షీటర్ దారుణ హ‌త్య‌

వరంగల్ శివనగర్‌లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మంగళ వారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు

Update: 2023-08-30 08:58 GMT

వరంగల్ శివనగర్‌లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మంగళ వారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు రౌడీ షీటర్ నజీర్‌ను చుట్టుముట్టి కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హ‌త్య జ‌రిగిన ప్రాంతాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం నజీర్‌ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. నజీర్ కు భార్య రిజ్వానా బేగం.. నలుగురు కుమార్తెలు ఉన్నారు. రౌడీ షీట‌ర్‌గా చెలామ‌ణి అవుతూ స్థానికంగా హ‌ల్‌చ‌ల్ చేసే నజీర్.. శివనగర్ లోని తన అత్తగారింట్లో నివాసం ఉంటూ వరంగల్ రైల్వే స్టేషన్‌లో స్టాల్ నిర్వహిస్తున్నాడు. ఉమేష్ అనే వ్య‌క్తి ఎప్పుడూ మృతుడు న‌రేష్ వెంటే ఉండేవాడు.

నజీర్ కు రైల్లో కీ చైన్‌లు విక్రయించే ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్య‌క్తుల‌తో పరిచయం ఏర్పడింది. వారు 15 రోజుల క్రితం శివనగర్ కు చెందిన ఒక వ్యక్తితో ఘర్షణకు దిగారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘర్షణ పెర‌గ‌డంతో ప‌ర‌స్ప‌రం ఒక‌రిపై ఒక‌రు మిల్స్‌ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నజీర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇరువ‌ర్గాల మ‌ధ్య‌ రాజీ కుదిర్చాడు.

అనంత‌రం మంగళవారం రాత్రి సమయంలో నజీర్.. యూపీ వ్యక్తులు ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. అక్కడ నజీర్, ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన యూపీ వ్య‌క్తులు నజీర్‌ను చుట్టుముట్టి రాడ్లతో అతనిపై దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.

నిందితుల‌లో ఒక‌డైన వికాస్ భార్య‌ గర్భవతి కావడంతో పారిపోలేకపోయాడు. పోలీసులు అతడిని అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నజీర్ వెంట ఉమేష్ కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల వద్దకు వెళ్లాడు. కానీ నజీర్‌ను హత్య చేస్తున్న సమయంలో ఉమేష్ అక్కడి నుండి పారిపోయాడు. ఉమేష్ దొరికితే ఈ హత్యకు గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య రిజ్వానా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News