Serial Actress: టీవీ నటి పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే?

టీవీ నటి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే బాధతో;

Update: 2024-10-03 09:35 GMT
Actress, TVActress, Rejecting, Marriage, serial actress not ready to marry him Youth ends life at TV MarriageProposal, latest news telugu today

Actress

  • whatsapp icon

టీవీ నటి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే బాధతో 25 ఏళ్ల యువకుడు తన జీవితాన్ని ముగించుకున్నాడు. మృతుడు మదన్ (25) ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేస్తున్నాడు. నివేదికల ప్రకారం, టీవీ సీరియల్స్‌లో పనిచేస్తున్న యువతితో మదన్ కు పరిచయం ఉంది. ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారని సమాచారం. పెళ్లి చేసుకోవాలని సదరు నటి అంతకు ముందు చాలాసార్లు మదన్‌ను అడిగింది, అయితే మదన్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు ఉదయవాణి పత్రిక నివేదించింది.

ఇక అక్టోబరు 1న నటి మదన్‌ను సీకే పాళ్యలోని తన ఇంటికి పిలిపించింది. అక్కడ వీరిద్దరూ పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో మదన్ పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు, అయితే ఈసారి పెళ్లి చేసుకోడానికి ఆమె నిరాకరించింది. ఆమె తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన మదన్ ఉరివేసుకున్నాడు. అయితే పెళ్లి సాకుతో సదరు నటి చాలా మంది యువకులను మోసం చేసిందని మదన్ తల్లిదండ్రులు ఆరోపించారు. హుళిమావు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని, నటిని పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూలాల ప్రకారం సదరు నటి కొన్ని కన్నడ టీవీ సీరియల్స్, వాణిజ్య ప్రకటనలలో కూడా నటించింది.
Tags:    

Similar News