Road Accident : కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.;

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కడప జిల్లా ఒంటిమిట్ల మండలం నడింపల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వామనాలు వరసగా ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి నుంచి వస్తున్న వాహనాన్ని పోలీసు రక్షక్ వాహనం ఢీకొట్టింది.
నంద్యాలకు చెందిన...
ఈ ఘటనలో స్పార్పియో వాహనంలో ఉన్న ముగ్గురు మరణించారు. మృతులందరూ నంద్యాలకు చెందిన వాసులుగా గుర్తించారు. అయితే పోలీసు రక్షక్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్, డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.