Road Accident : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు;

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కర్ణాటక ఆర్టీసీ బస్సు రెండు బైకులను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒకరికి తీవ్ర గాయాలు...
గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.