Road Accident : ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు;

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో ఈ ప్రమదం జరిగింది. రెండు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టడంతో దాదాపు నలభై మంది వరకూ గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన నలభై మందిని కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిద్రలేమితో...
రెండు బస్సులు ఢీకొట్టటానికి ప్రధాన కారణం అతి వేగంతో పాటు నిద్రలేమి అని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఆరోగ్యం విషమించిన ఐదుగురిని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోరుతున్నారు. పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుతప్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు