మహిళను అర్ధ నగ్నంగా ఊరేగించిన భర్త, బంధువులు
ఇదే వారి మధ్య వివాదానికి దారితీసిందని సవిత చెప్పుకొచ్చింది. అత్తమామలు, భర్త దారుణంగా కొట్టారు.
మహిళను కొట్టి వేధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కొలారస్ ప్రాంతంలో ఆస్తి వివాదంలో ఒక మహిళను ఆమె భర్త, అత్తమామలు అర్ధనగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. కొలారస్‌లోని హరిపూర్ గ్రామానికి చెందిన సవిత కేవత్ తన తల్లిదండ్రుల ఆర్థిక సహాయంతో ఓ ప్లాట్‌ను కొనుగోలు చేసింది. తాను కూలీ పనులు చేస్తూ ప్లాట్ల వాయిదాలు జమచేశానని, అయితే ప్లాట్ రిజిస్ర్టేషన్ సమయంలో అత్తమామలతో సహా ఆమె భర్త కలిసి.. భర్త పేరు మీద ప్లాట్ రిజిష్టర్ చేయాలని ఒత్తిడి తెచ్చారని సవిత తెలిపింది. ప్లాట్‌ని తన భర్త పేరు మీద రిజిస్టర్ చేస్తే అమ్మేస్తాడని, పిల్లలను చదివించాలనే తన కల నెరవేరదని భావించి అందుకు ఒప్పుకోలేదు.
ఇదే వారి మధ్య వివాదానికి దారితీసిందని సవిత చెప్పుకొచ్చింది. అత్తమామలు, భర్త దారుణంగా కొట్టారు. ఆమెను అర్ధనగ్నంగా చేసి దారుణంగా కొట్టాడు. ఘటన అనంతరం బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఆమె భర్తను, బంధువులపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొద్దిరోజుల కిందట కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎంపీ జిల్లా దేవాస్‌లో వివాహితైన గిరిజన మహిళను కొట్టి, వివస్త్రను చేశారు. ఆ మహిళ మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ గ్రామంలో నడిపించారు. గిరిజన మహిళకు కూడా పాదరక్షల మాల వేసేలా చేశారు. భర్తను కూడా ఆమె తన భుజాల మీద మోయాల్సి వచ్చింది.