నిర్లక్ష్యం ఖరీదు ఆరు ప్రాణాలు

వివరాల్లోకి వెళ్తే.. నిసిద్ పూర్ అనే పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.

Update: 2023-05-30 07:39 GMT

jharkhand railway workers dead

అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జార్ఖండ్ రైల్వే స్టేషన్లో కరెంట్ షాక్ తగిలి ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నిసిద్ పూర్ అనే పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో రైలు పట్టాలపై కరెంట్ పాస్ అవడంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ధన్ బాద్, గోమో రైల్వే స్టేషన్ల మధ్య ఉండే ఫిక్స్ డ్ పూర్ రైల్వే గేట్ సమీపంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్న కూలీలుగా గుర్తించారు.

విద్యుత్ స్తంభం ఏర్పాటు పనులు జరుగుతుండగా.. 25 వోల్టుల హైవోల్టేజీ విద్యుత్ ప్రవహించడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఊహించని రీతిలో కరెంట్ షాక్ కు గురై ఆరుగురు కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా.. ఆ రైల్వే లైన్ మీదుగా వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. స్థానికంగా ఈ ఘటన తీవ్రకలకలం రేపింది. విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తున్నపుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆరుగురి ప్రాణాలు బలయ్యాయి.


Tags:    

Similar News