క్లాస్ రూమ్ లో విద్యార్థిని బట్టలు విప్పించిన టీచర్.. అవమాన భారంతో..

ఇటీవల ఆ పాఠశాలలో పరీక్షలు జరిగాయి. పరీక్షల్లో విద్యార్థిని కాపీ కొడుతోందని భావించిన ఇన్విజిలేటర్.. చిట్టీలున్నాయోమోనన్న ఉద్దేశంతో..

Update: 2022-10-15 12:21 GMT

jharkhand crime news

ఓ పాఠశాలలో జరుగుతున్న పరీక్షల్లో.. ఒక విద్యార్థిని పరీక్షల్లో కాపీకొడుతుందని భావించిన టీచర్.. క్లాస్ రూమ్ లో అందరిముందు ఆమె బట్టలు విప్పించింది. దాంతో అవమానంగా భావించిన బాలిక కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్లో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 ఏళ్ల బాలిక స్థానిక బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.

ఇటీవల ఆ పాఠశాలలో పరీక్షలు జరిగాయి. పరీక్షల్లో విద్యార్థిని కాపీ కొడుతోందని భావించిన ఇన్విజిలేటర్.. చిట్టీలున్నాయోమోనన్న ఉద్దేశంతో ఆమె దుస్తుల్ని విప్పించి.. తనిఖీ చేసింది. క్లాస్ రూమ్‌లో అందరిముందూ దుస్తులు విప్పించడంతో బాలిక అవమానంగా భావించింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు మంటల్ని ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక శరీరం 80 శాతం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక వాంగ్మూలం సేకరించి.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


Similar News