ఉగాది రోజు విషాదం.. నలుగురు మృతి

ఉగాది పండగ రోజు విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు;

Update: 2022-04-02 03:51 GMT
road accident, four people died, nagar kurnool district
  • whatsapp icon

ఉగాది పండగ రోజు విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్ ను కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

అతి వేగమే...
అతి వేగమే కారు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News