మీ ఫోన్ మిమ్మల్ని నియంత్రిస్తోందా?
మన జీవితం మీద స్మార్ట్ ఫోన్స్ ప్రభావం చాలా ఉంటుంది. జీవితం మీద స్మార్ట్ ఫోన్ ప్రభావం చూపించేలా చేసుకోకండి
మన జీవితం మీద స్మార్ట్ ఫోన్స్ ప్రభావం చాలా ఉంటుంది. ఏ సమయంలో అయినా స్మార్ట్ ఫోన్ పక్కన లేకుంటే ఏదో అయిపోయిందని టెన్షన్ పడిపోతూ ఉంటాం. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా మన జీవితం చాలా ప్రభావితమవుతూ ఉంది. స్మార్ట్‌ఫోన్‌లు లేకపోతే మనం ఏమైపోతామో అనే భయాన్ని మనకు కల్పిస్తూ ఉన్నాయి. ఎంతగా భయపెడుతున్నాయంటే సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, ఇతర విభాగాల నిపుణులు స్మార్ట్‌ఫోన్‌లకు అలవాటు పడకుండా.. వాటికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు.
కేవలం సమాచారం కోసం మాత్రమే కాకుండా.. Facebook, Twitter, Google, Instagram వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్ ఫోన్స్ ను ఎంతగానో ఉపయోగిస్తూ ఉంటాం. ఇక సోషల్ మీడియాలో ఎవరెవరితోనో పరిచయాలు చేసుకుంటూ ఉంటాం. మన పర్సనల్ డేటాను వాళ్ల ముందు వడ్డిస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు హ్యాకర్లు, స్టాకర్‌లు సులువుగా దాడి చేసే అవకాశం ఉంటుంది.
స్మార్ట్ ఫోన్ కంటే మీరే స్మార్ట్ అని నిరూపించుకోవడం ఎలా:
స్మార్ట్‌ఫోన్‌ల కంటే మీరే తెలివైన వాళ్ళని నిరూపించే ముఖ్యమైన అంశాలు:
(ఎ) స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా మీకు అంతరాయం కలుగకూడదు
(బి) స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా మీ దృష్టి మరల్చనివ్వకూడదు
(సి) స్మార్ట్‌ఫోన్‌లు మీ గోప్యతపై దాడి చేయనివ్వకూడదు
(డి) స్మార్ట్‌ఫోన్‌లు మీ నిద్రను నాశనం చేయనివ్వకూడదు
(డి) స్మార్ట్‌ఫోన్‌లను మీరు ఉదయానే నిద్రలేవగానే చేతుల్లోకి తీసుకోకూడదు.
స్మార్ట్‌ఫోన్ ఒక అద్భుతమైన మానవ ఆవిష్కరణ.. అది మనకు ఉపయోగపడాలే కానీ.. అది మన జీవితాలను శాసించనివ్వకూడదు
స్మార్ట్ ఫోన్-ఇంటర్నెట్ వినియోగం ఎంతగా ఉందంటే:
భారతదేశంలో 1.40 బిలియన్ల జనాభా ఉంది, అందులో 79% (1.10 బిలియన్) మంది మొబైల్ ఫోన్‌లను, 45% (624 మిలియన్లు) ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. 32% (448 మిలియన్లు) మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. సగటు ఇంటర్నెట్ సెషన్ 6 గంటల 26 నిమిషాలు పాటు కొనసాగుతుంది. భారతదేశంలోని 1.10 బిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులలో 96.7% మంది ఆన్‌లైన్ వీడియోలను చూస్తున్నారు, 82% మంది ప్రత్యక్ష ప్రసారాలను చూస్తున్నారు, 52% మంది FM రేడియో స్టేషన్‌లను వింటున్నారు. 50% మంది పాడ్‌క్యాస్ట్‌లను వింటున్నారు. వీటన్నింటినీ 86% మంది స్మార్ట్‌ఫోన్‌లలోనే వాడుతున్నారు.
మీ స్మార్ట్‌ఫోన్ గురించి ఈ విషయాలను కూడా తెలుసుకోండి:
* మీ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లు మీ డేటాను ఎలా యాక్సెస్ చేస్తాయి - https://reports.exodus-privacy.eu.org/en/
* చిత్రాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయడం (రివర్స్ ఇమేజ్ చెక్) – https://images.google.com
* సంక్షిప్త వెబ్ లింక్‌లను అన్-షార్ట్ చేయండి – https://www.unshorten.it
* వెబ్‌సైట్ ఫిషింగ్ యాక్టివిటీ చేస్తోందో లేదో తనిఖీ చేయండి – https://isitphishing.org/
* చందాదారులు తమ రిజిస్టర్డ్ నంబర్‌లను ధృవీకరించడానికి, వారికి తెలియకుండా రిజిస్టర్ చేసిన నంబర్‌లను తీసివేయడానికి https://tafcop.dgtelecom.gov.in
* బల్క్ SMS పంపిన వారిని గుర్తించడానికి: https://smsheader.trai.gov.in/
* వీడియో అసలైనదా లేక డీప్‌ఫేక్ అని నిర్ధారించడానికి: https://platform.sensity.ai/deepfake-detection
స్మార్ట్ ఫోన్ నుండి మనం బ్రేక్ ఎందుకు తీసుకోవాలి:
* మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది – డిజిటల్ పరికరాల నుండి దూరంగా ఉన్నప్పుడు మన నిజ జీవితంలో ఏమి జరుగుతోంది.. ఎలా ముందుకు వెళుతున్నాం.. లాంటి ఎన్నో విషయాలపై దృష్టి పెట్టడానికి వీలుంటుంది.
బాగా అలవాటు పడిన సమయంలో.స్మార్ట్‌ఫోన్ లేదా నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు ఈ లక్షణాలను చూస్తున్నాము.
(ఎ) కోపం
(బి) టెన్షన్
(సి) డిప్రెషన్
(సి) చిరాకు
(ఇ) విశ్రాంతి లేకపోవడం.
* మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి – గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌లను వాడుతూ ఉండటం వల్ల శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మెడ, టెక్స్టింగ్ థంబ్ నొప్పిగా అనిపిస్తాయి. ఎక్కువసేపు స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల మైగ్రేన్‌లు, తలనొప్పి, కంటి సమస్యలు (కళ్ళు మంట, దురద, స్పష్టంగా కనిపించకపోవడం, కంటికి అలసట మొదలైనవి) ఎక్కువగా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌ని నిరంతరం ఉపయోగించడం వల్ల రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది.
* మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కో విధంగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఫోటోలు, వెళుతున్న ప్రదేశాలు, కొంటున్న వస్తువులను చూసి మీరు వారిలో ఎందుకు బ్రతకలేకపోతున్నామా అని నిరాశ చెందకండి. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కో రకంగా ఉంటుంది. మీరు మీ జీవితాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, అపరిచితులతో పోల్చుకోవద్దు.
* ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్ వినియోగం దృష్టి లోపాలను కలిగిస్తుంది. ప్రొడక్టివిటీ బాగా తగ్గుతుంది. ఇది డిజిటల్ వ్యసనంగా మారిపోతుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదగడానికి.. విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపరుచుకోడానికి స్మార్ట్ ఫోన్స్ కు దూరంగా ఉండడం చాలా మంచిది.
మీరు డిజిటల్ బ్రేక్ తీసుకోవాలని చెప్పే కొన్ని సంకేతాలు: -
* మీకు మీ స్మార్ట్‌ఫోన్ కనిపించకపోతే ఆందోళన లేదా ఒత్తిడికి గురవుతారు
* అవసరం ఉన్నా.. లేకపోయినా.. తరచుగా ప్రతి కొన్ని నిమిషాలకు మీ స్మార్ట్‌ఫోన్‌ని తనిఖీ చేస్తుంటారు
* సోషల్ మీడియాలో సమయం గడిపిన తర్వాత తరచుగా నిస్పృహ, ఆత్రుత, విశ్రాంతి లేకుండా ఉంటారు
* పోస్టింగ్, కామెంట్‌లు, రీ-షేరింగ్, లైక్ వంటి వాటిపై దృష్టి పెడుతూ ఉంటారు. ఇతరులు కూడా మీ పోస్ట్ లను లైక్, కామెంట్ చేయాలని ఆశిస్తూ ఉంటారు
* తరచుగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో సోషల్ మీడియాలో ఉండడానికి ఆలస్యంగా పడుకోవడం.. త్వరగా నిద్రలేవడం జరుగుతూ ఉంటుంది
* మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూనే ఉంటారు, ఏకాగ్రతతో వేరే పనులను చేయలేరు
* మీకు వచ్చే ప్రతి నోటిఫికేషన్ కోసం మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను తనిఖీ చేస్తారు.
డిజిటల్ బ్రేక్ తీసుకోవడానికి చిట్కాలు: -
* మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్ లను నిలిపివేయండి. ఈ నోటిఫికేషన్స్ ద్వారా తెలియాల్సిన విషయాలకంటే ఇతర విషయాలను మీకు తెలియజేస్తాయి. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టేలా చేస్తుంటాయి
* మీ పడకగదిని స్మార్ట్‌ఫోన్ రహిత జోన్‌గా మార్చుకోండి.
* ఎలక్ట్రానిక్ పరికరాలను పడకగది వెలుపల ఛార్జ్ చేయండి.
* మీ స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా మీ కంప్యూటర్ నుండి సోషల్ మీడియాను యాక్సెస్ చేయండి. మీరు సోషల్ మీడియా యాక్టివిటీ షెడ్యూల్‌ను సెట్ చేసుకోవడం చాలా మంచి పని
* మీ హోమ్ స్క్రీన్‌పై ముఖ్యమైన అప్లికేషన్స్ ను మాత్రమే ఉంచండి.
* స్నేహితులు, కుటుంబ సభ్యులతో భోజనం చేసే సమయంలో మీ ఫోన్‌ను దూరంగా ఉంచండి, మీ కుటుంబ సభ్యులతో గడిపే కీలక సమయంలో మొబైల్ ఫోన్స్ ను వాడకపోవడం చాలా మంచిది.
* మీ ఆఫీసుల్లో స్మార్ట్ డివైజెస్ రహిత సమావేశాలను సృష్టించండి. ఇలాంటి సమయంలో జరిగే చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి
* మీ స్మార్ట్‌ఫోన్‌లో గ్రే స్కేల్ మోడ్‌ని ఉపయోగించండి, ఇది స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ సమయం ఉపయోగించకుండా చేస్తుంది
* స్క్రీన్ టైమ్ (ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటం) కంటే ఎక్కువ గ్రీన్ టైమ్ (భౌతిక ఆటలు ఆడటం) ఉండేలా చూసుకోండి
* iOS స్మార్ట్‌ఫోన్‌లలో “స్క్రీన్ టైమ్” యాప్‌ని ఉపయోగించి మీ వినియోగాన్ని ట్రాక్ చేయండి.
* Android స్మార్ట్‌ఫోన్‌లలో “డిజిటల్ వెల్‌బీయింగ్” యాప్‌ని ఉపయోగించి మీ వినియోగాన్ని ట్రాక్ చేయండి.
* యాప్-స్టోర్, ప్లే-స్టోర్‌లో అందుబాటులో ఉండే ప్రొడక్టివ్ యాప్‌లను ఉపయోగించండి.
Stay tuned to the Cyber Samacharam Column contributed by Anil Rachamalla from the End Now Foundation. https://www.endnowfoundation.org