Whatsapp latest feature:మరో సూపర్ ఫీచర్ తో రాబోతున్న వాట్సాప్
గత కొన్ని నెలలుగా, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది
Whatsapp latest feature:గత కొన్ని నెలలుగా, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. WhatsApp వెబ్ వెర్షన్ కోసం కొత్త ఫీచర్లు, ఇతరుల ప్రొఫైల్ స్క్రీన్‌షాట్‌లను తీయకుండా ఆపడం, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లో కీలక అప్డేట్స్ ను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటోంది. వాట్సాప్ త్వరలో ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు కూడా సందేశాలను పంపే అవకాశం కూడా వినియోగదారులకు ఇస్తుందని తాజా నివేదిక తెలిపింది. ఉదాహరణకు, మీరు WhatsAppని ఉపయోగించి టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లకు సందేశాలను పంపవచ్చు. ఈ ఫీచర్‌లో భాగంగా మద్దతిచ్చే యాప్‌లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఫీచర్ వస్తే మాత్రం ఒక యాప్ నుండి మరొక యాప్ ను వాడుతున్న యూజర్లకు మెసేజీలు పంపుకోవచ్చు.
WhatsApp వెర్షన్ 2.24.6.2గా గుర్తించిన కొత్త అప్‌డేట్‌ను మెటా పరిచయం చేయనుంది. ఈ అప్డేట్ లో థర్డ్-పార్టీ యాప్స్ లో చాట్ చేయడానికి రూపొందించిన కీలక అప్డేట్స్ ఉండనున్నాయి. వివిధ అప్లికేషన్‌లలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి చాట్ ఇంటర్‌ఆపరేబిలిటీని తీసుకుని రానున్నారు. డిజిటల్ మార్కెట్స్ చట్టం (DMA)కి ప్రతిస్పందనగా, WhatsApp Android కోసం బీటా వెర్షన్ 2.24.5.18లో చాట్ ఇంటర్‌పెరాబిలిటీ ఫీచర్‌పై పని చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. Google Play Store నుండి 2.24.5.20 బీటా అప్‌డేట్ లో WhatsApp థర్డ్-పార్టీ యాప్ ల కోసం ప్రత్యేకమైన చాట్ స్క్రీన్‌ను అభివృద్ధి చేస్తోంది.