సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. అవ్వడం ఎలా? పార్ట్-1

మీరు మీ పోస్ట్‌లను కొన్ని వారాల ముందే షెడ్యూల్ చేసుకోవచ్చు. కానీ కొన్ని కొన్నిసార్లు

Update: 2023-09-20 02:16 GMT

సోషల్ మీడియా.. ఇప్పుడు గొప్ప సాధనంగా మారిపోయింది. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది సోషల్ మీడియా.. చాలా మందికి గొప్ప భవిష్యత్తును ఇచ్చింది సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛకు చాలా శక్తివంతమైన సాధనం. డైరెక్ట్ గా తమ వాయిస్ ను వినిపించలేని వ్యక్తులకు సోషల్ మీడియా అనేది గొప్ప వేదిక లాంటిది. సాధారణ సోషల్ మీడియా యూజర్లలో మెజారిటీ.. తమ సోషల్ మీడియా ఖాతాలను కేవలం తమ స్టేటస్ లు పెట్టడం.. తమకు పరిచయం అయిన వాళ్ళను ఫాలో అవుతూ.. వారితో సంభాషించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ సోషల్ మీడియాను సరిగా వాడుకుంటే మాత్రం మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయొచ్చనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

సోషల్ మీడియా ఛానెల్‌లో వీడియోలను పోస్ట్ చేసే ప్రతి ఒక్కరూ ఇన్‌ఫ్లుయెన్సర్‌ లు అయిపోరు. స్వతహాగా కంటెంట్ ను క్రియేట్ చేసే సత్తా ఉండాలి. ఇది అందరి విషయంలో జరగకపోవచ్చు. కొందరు వెంటనే సక్సెస్ అయిపోతే.. ఇంకొందరు నిదానంగా ఫేమస్ అవుతారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో విజయవంతం కావాలంటే సమాజానికి ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసే వ్యక్తి కూడా అయ్యుండాలి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎక్కువ మంది ఫాలోవర్లు / సబ్‌స్క్రైబర్‌లను పొందడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అప్లోడ్ చేస్తున్న కంటెంట్ తో వీలైనంత మందిని ఆకర్షించడమే వారి ధ్యేయం. కానీ నిలకడగా.. నిజాయితీగా.. ఎవరినీ నొప్పించకుండా అందించే కంటెంట్ తో ఎంతో మంది మన్ననలను పొందవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఎక్కువ మంది ఫాలోవర్లు/ సబ్స్క్రైబర్లను పొందడం ఎలా:

గుడ్ బ్రాండ్ - మంచి కంటెంట్ కు ప్రకటనల కోసం డబ్బు ఖర్చు చేయడం సరిపోదు. మీరు విశ్వసనీయంగా ఉండాలి. మీరు అర్థవంతమైన కంటెంట్, సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ను ఇస్తూ ఉండాలి.
ఎంగేజ్మెంట్ - సబ్‌స్క్రైబర్‌లు/ఫాలోవర్లతో టచ్ లో ఉండడం వల్ల మీ ఉనికిని వాళ్లు గుర్తిస్తారు.. ఫాలోవర్లు కూడా మీతో మాట్లాడడం, మీరు స్పందించడం చూసి మురిసిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి చాలా వరకూ కామెంట్లకు ప్రత్యుత్తరం ఇవ్వడం మర్చిపోవద్దు. మీ ఫాలోవర్లు/సబ్ స్క్రైబర్లు ఎక్కువగా ఉన్నట్లయితే సొంతమందికి అయినా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నించండి.
టోన్ అండ్ టెన్యూర్ - ఫాలోవర్ల దృక్కోణం నుండి ఆలోచించి అందుకు తగ్గట్టుగా కంటెంట్ ను ఇవ్వడానికి ప్రయత్నించండి. వారిని మీ ఛానెల్‌లో హీరోలను చేయండి. వారికి కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నామని వారికి తప్పకుండా అర్థం అవుతుంది. కొన్ని కొన్ని సార్లు ఇలాంటివే సంచలనం అయ్యే అవకాశం ఉంది. మిగిలిన కంటెంట్ ను కూడా ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ ఉండాలి.
ప్రమోట్ - మీ ఛానెల్‌లను ఫాలో అవ్వమని అడగడంలో మీరు మొహమాట పడకండి. మీరు పోస్ట్ చేసే మీ బ్లాగ్ చివరిలో మీ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో మీ ఛానెల్‌ కి సంబంధించిన సమాచారం కూడా అందించాలి. బాట్ లేదా గోస్ట్ సబ్‌స్క్రైబర్‌లను కొనుగోలు చేయడంతో ఉపయోగం ఉండదు. సంబంధిత సోషల్ మీడియా ఛానెల్‌లలో పెయిడ్ ప్రమోషన్‌కు ప్రాధాన్యత ఇస్తారు.
పోటీదారులు - మీ పోటీదారులు ఎవరు, వారు ఏ స్థానంలో ఉన్నారు.. వారు ఏమి చేస్తున్నారు.. ఏమి చేసేవారు.. మనకంటే బాగా/గొప్పగా చేస్తున్నారేమో అని ఎల్లప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండండి. సబ్‌స్క్రయిబ్ చేయడం ఫాలో అవ్వడం వంటి విషయాలపై మీరు దృష్టి పెట్టండి. మీ సబ్‌స్క్రైబర్ బేస్‌ను నిర్మించగల వ్యూహాన్ని కూడా రూపొందించాలి.
పరిమాణం కంటే 'క్వాలిటీ' చాలా ముఖ్యం - ఎంత పడితే అంత.. ఇష్టమొచ్చినట్లుగా కంటెంట్ ను అప్లోడ్ చేసే బదులు.. క్వాలిటీ గురించి కూడా ఆలోచించండి. మీరు ప్రతిరోజూ పోస్ట్ లు పెడితే మీ ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోదు. ప్రతి పోస్ట్ మీ లక్ష్యానికి దగ్గరగా ఉండాలి. ఆ లక్ష్యంతో సంబంధం ఉందా లేదా అని నిర్ధారించుకోండి.
ట్రోల్స్ - సోషల్ మీడియా అన్నాక.. ట్రోల్స్ సర్వ సాధారణం. కొందరు ఫన్ జెనరేట్ చేయడానికి ట్రోల్ చేస్తే.. మరి కొందరు రెచ్చగొట్టేందుకు.. వివాదాలు సృష్టించడానికి ట్రోల్స్ చేస్తారు. ఇలాంటి వాటిని మీరు మీ మనసులోకి తీసుకోకండి. కాబట్టి ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోకండి.
సరైన ఛానల్స్ ను ఎంపిక చేసుకోండి - అన్ని సోషల్ మీడియా ఛానెల్‌లు, సంస్థలు కంటెంట్‌ను మానిటైజ్ చేస్తున్నాయి. Facebook వార్తలు, వినోదం కోసం, Twitter - బ్లాగ్ పోస్ట్‌లను భాగస్వామ్యం చేయడం, వెబ్‌సైట్ కంటెంట్‌ను ప్రచారం చేయడం కోసం.. Instagram - ఫోటోలు, వీడియోలు వంటి విజువల్ బ్రాండ్స్ కోసం ఉత్తమంగా సరిపోతుంది, ఇక లింక్డ్‌ఇన్ - ఇండస్ట్రీ రిలేటెడ్ ఆర్టికల్స్, ప్రొఫెషనల్ కంటెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు.
నెగటివ్ కామెంట్స్ - విమర్శలు మనకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చేసిందే కరెక్ట్ అనే ధోరణిలో వెళ్లడం కూడా మూర్ఖత్వం అవుతుంది. మీ రిప్లైకి సంబంధించి కూడా నిజాయితీగా ఉండండి. మీ సోషల్ మీడియా పరంగా ఫాలోవర్లతో మంచి సంబంధాలను కొనసాగించాలన్నా నెగటివ్ కామెంట్స్ ను మీ తప్పులను తెలుసుకునే సాధనంగా ఉపయోగిస్తే చాలా మంచిది.
ఆటోమేషన్ - మీరు మీ పోస్ట్‌లను కొన్ని వారాల ముందే షెడ్యూల్ చేసుకోవచ్చు. కానీ కొన్ని కొన్నిసార్లు మీరు డిస్‌కనెక్ట్ అవ్వవచ్చు కూడా.. ఎందుకంటే చాలా ఆటోమేషన్ టూల్స్ థర్డ్ పార్టీలను ట్యాగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండవు.
హ్యాష్ టాగ్స్ - హ్యాష్‌ట్యాగ్‌లపై సరైన పరిశోధన చేయండి. మీరు ఇస్తున్న కంటెంట్ కు.. ఆ హ్యాష్ ట్యాగ్ కు కంటెంట్ కు సంబంధం ఉండేలా చూసుకోండి. కొన్ని కొన్ని సార్లు కొన్ని హ్యాష్ ట్యాగ్ ల కారణంగా అవి ఇబ్బందిని కూడా కలిగించవచ్చు. అది మీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది.

Stay tuned to the Cyber Samacharam Column contributed by Anil Rachamalla from the End Now Foundation. 

Tags:    

Similar News