MARCH 8 HOROSCOPE : నేడు ఈ రాశుల వారికి ఖర్చులు విపరీతం, మనశ్శాంతి ఉండదు

ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రహస్య శత్రువులతో ఇబ్బంది పడతారు.;

Update: 2023-03-07 23:30 GMT
march 8 horoscope, daily horoscope in telugu

march 8 horoscope, daily horoscope in telugu

  • whatsapp icon

నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బుధవారం

తిథి : బ.పాడ్యమి రా.7.42 వరకు
నక్షత్రం : ఉత్తర తె.4.20 వరకు
వర్జ్యం : ఉ.10.10 నుండి 11.53 వరకు
దుర్ముహూర్తం : మ.11.55 నుండి 12.42 వరకు
రాహుకాలం : మ.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభ సమయాలు : సా.4.50 నుండి 5.20 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. న్యాయపరమైన అంశాలు సానుకూలంగా సాగుతాయి.స్థలాల క్రయవిక్రయాల్లో తుది నిర్ణయాలు తీసుకుంటారు. అపోహలను తొలగించుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. ఈ రోజు ధరించకూడని రంగు వంకాయ రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన తగాదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఎదుటివారితో ఎంతతక్కువగా మాట్లాడితే అంతమంచిది. శత్రుబలం పెరుగుతుంది. గతంలో దాచుకున్న డబ్బు ఖర్చైపోతుంది. ఈ రోజు ధరించకూడని రంగు తెలుపు రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రహస్య శత్రువులతో ఇబ్బంది పడతారు. రిస్క్ తో కూడిన వ్యాపారాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలను వీలైనంతవరకూ వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పనులపై మాత్రం దృష్టి పెట్టడం మేలు. రోజు ధరించకూడని రంగు పసుపు రంగు.
కర్కాటక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. లౌక్యంగా వ్యవహరిస్తారు. ఆర్థికసర్దుబాట్లు నేర్పుగా చేసుకోగలుగుతారు. పెట్టుబడులు సమకూరుతాయి. అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఈ రోజు ధరించకూడని రంగు గోధుమ రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఎదుటివారు శత్రువులని తెలిసినా మాటామంతీ సాగించక తప్పదు. ఈ రోజు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
కన్య రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ప్రశాంతతకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులుండవు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ఈ రోజు ధరించకూడని రంగు నలుపు రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్నట్లుగా రోజు ఉండదు. పనిని వాయిదా వేయలేరు. పూర్తి చేసేందుకు శరీరం సహకరించదు. ఖర్చులు పెరుగుతాయి.ఈ రోజు ధరించకూడని రంగు కాషాయ రంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. అప్పులు తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి.దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తులపై దృష్టి సారిస్తారు. ఈ రోజు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. శుభవార్తలు వింటారు. పాతపరిచయాలు జ్ఞాపకం వస్తాయి. పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఈ రోజు ధరించకూడని రంగు నీలం రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు అన్నివిధాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ తగదు. కీడెంచి మేలెంచాలన్న విధంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. రిస్క్ కి ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. ఈ రోజు ధరించకూడని రంగు కాఫీ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు ఆధ్యాత్మిక భావజాలాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నాలు కలసివస్తాయి. భూమికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు ధరించకూడని రంగు బూడిద రంగు.


Tags:    

Similar News