ఫ్యాక్ట్ చెక్: జూన్ 18 వరకూ ఎన్.టి.ఏ. వెబ్ సైట్ ను హ్యాక్ చేసి ఉంచలేదు

డార్క్ వెబ్‌లో విద్యార్థులకు సంబంధించిన డేటా అందుబాటులో ఉంది

Update: 2024-07-06 02:45 GMT

జూన్ 27, 2024 సాయంత్రం నాడు NTA(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఢిల్లీ కార్యాలయం ముందు కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) నిరసన తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం, మే NEET-UG పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వేసిన పిటిషన్‌పై జూలై 8, 2024లోగా స్పందించాలని ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది.

నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్‌లో తెలిపింది. పేపర్ లీక్ ఘటన వెనుక వ్యవస్థీకృత సంబంధం ఉందా అనే కోణంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోందని తెలిపింది. పేపర్ లీక్ విషయం తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నప్పటికీ పరీక్షను రద్దు చేయడం సాధ్యం కాలేదని తెలిపింది.
ఇలాంటి పరిస్థితుల్లో 40 సెకన్ల నిడివి గల వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒక టెలివిజన్ గ్రాఫిక్స్ లాగా అనిపించే వీడియోలో “జూన్ 18 వరకు NTA వెబ్‌సైట్ హ్యాక్ చేశారు” అనే శీర్షికతో సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తున్నారు. డార్క్ వెబ్‌లో విద్యార్థులకు సంబంధించిన సున్నితమైన డేటా అందుబాటులో ఉందని.. ఇది గోప్యతకు తీవ్రమైన ఉల్లంఘన అని అందులో ఉంది. గ్రే మార్కెట్‌లో విద్యార్థుల డేటా లాభదాయకమైన వ్యాపారం. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, కన్సల్టెన్సీ ఏజెన్సీలు అతిపెద్ద కస్టమర్‌లు. డేటాను కొనుగోలు చేసిన తర్వాత, వారు విద్యార్థులకు ఇమెయిల్‌లు, అడ్మిషన్, కోర్సులకు సంబంధించి కాల్స్ చేశారు” అని అందులో ఉంది. అంతేకాకుండా NEET-UG రిగ్గింగ్ చేశారనే వాదనతో పోస్టులను వైరల్ చేస్తున్నారు.


మరొక వినియోగదారుడు కూడా ఈ విషయాన్ని “ఎన్‌టిఏ వెబ్‌సైట్ జూన్ 18 వరకు హ్యాక్ చేశారని Zee News నివేదించింది. ఇది షాకింగ్ విషయం. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి." అని పోస్టు పెట్టారు.


ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాం. NTA ప్రకారం, సైట్‌లోని మొత్తం డేటా సురక్షితంగా ఉంది.
ఈ వాదనలు దావానలంలా వ్యాపించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వీటిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఒక ప్రకటనను పంచుకుంది. “NTA వెబ్‌సైట్, దాని అన్ని వెబ్ పోర్టల్‌లు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. హ్యాక్ చేశారంటూ తప్పుడు సమాచారం తప్పుదారి పట్టించేదిగా ఉంది." అంటూ పోస్టు పెట్టింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్‌ కూడా ఇవన్నీ తప్పుడు కథానాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్లు మేము కనుగొన్నాము. “క్లెయిమ్ నకిలీది. వెబ్‌సైట్ హ్యాక్ కావడం గురించి వైరల్ అవుతున్న ఏదైనా సమాచారం నిరాధారమైనది. NTA వెబ్‌సైట్, దాని అన్ని వెబ్ పోర్టల్‌లు పూర్తిగా సురక్షితమైనవి." అంటూ వివరణ ఇచ్చింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ సమయంలో, PIB ఫ్యాక్ట్ చెక్ అదే వైరల్ వీడియోను ఫేక్ అంటూ షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము
“జూన్ 18 వరకు @NTA ఎగ్జామ్స్ వెబ్‌సైట్ హ్యాక్ చేశారని, అందుకు సంబంధించిన డేటా డార్క్ వెబ్‌లో అమ్మారంటూ ఒక వీడియోలో క్లెయిమ్ చేశారు. PIB ఫాక్ట్ చెక్ ఈ క్లెయిమ్ నకిలీదని గుర్తించింది. వెబ్‌సైట్‌లు హ్యాక్ అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైనది. NTA వెబ్‌సైట్, దాని అన్ని వెబ్ పోర్టల్‌లు పూర్తిగా సురక్షితం” అని అందులో వివరించారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దానికి సంబంధించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. “NTA వెబ్‌సైట్, దాని ఇతర పోర్టల్‌లు సురక్షితం; హ్యాక్‌కు గురైనట్లు వచ్చిన నివేదికలు తప్పు: అధికారులు" అనే టైటిల్ తో కథనాన్ని ప్రచురించారు.
విద్యా మంత్రిత్వ శాఖ శనివారం NTA పనితీరును సమీక్షించడానికి, పరీక్ష సంస్కరణలను సిఫార్సు చేయడానికి, డేటా భద్రతను నిర్ధారించడానికి ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. NTA వెబ్‌సైట్, దాని అన్ని వెబ్ పోర్టల్‌లు పూర్తిగా సురక్షితం.. హ్యాక్‌కు గురైందనే వాదన తప్పుదోవ పట్టించేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పలు మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని పంచుకున్నాయి AbpLive, PTI
వివిధ మీడియా నివేదికల ఆధారంగా మేము వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొన్నాము. NTA ప్రకారం, జూన్ 18 వరకు వెబ్‌సైట్ ను హ్యాక్ చేసి ఉంచలేదు. సైట్‌లోని డేటా సురక్షితంగా ఉంది.


Claim :  జూన్ 18 వరకూ NTA వెబ్‌సైట్ ను హ్యాక్ చేశారు. డార్క్ వెబ్‌లో విద్యార్థులకు సంబంధించిన డేటా అందుబాటులో ఉంది
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News