ఫ్యాక్ట్ చెక్: తమిళనటుడు విజయ్ జోసెఫ్ తన స్పీచ్ లో భాగంగా వైఎస్ జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తమిళనటుడు విజయ్ విమర్శలు గుప్పించారు
స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అక్టోబర్ 27, 2024న తన పార్టీ మొదటి బహిరంగ సభను ప్రకటించారు. తమిళగా వెట్రి కజగం (TVK) పార్టీని అధికారికంగా ప్రారంభించారు. డీఎంకే, అన్నాడీఎంకే తర్వాత తమిళనాడులో మూడో ప్రధాన పార్టీగా నిలవాలని నటుడు విజయ్ భావిస్తున్నాడు. 2026 ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే తన లక్ష్యమని విజయ్ తేల్చి చెప్పారు.
ఈ ఏడాదికి 75 ఏళ్లు పూర్తీ చేసుకున్న DMKని విజయ్ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించారు. అదే సమయంలో అన్నాడీఎంకేను పెద్దగా పట్టించుకోలేదు విజయ్. డిఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం ఉమ్మడి ఓట్ షేర్‌ని నియంత్రిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే డీలా పడింది. ఇప్పుడు విజయ్ ఎదగడానికి కూడా భారీ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దశాబ్ద కాలంగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికి, 2026 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు విజయ్. ఈ ఏడాది ఫిబ్రవరి 2న విజయ్ రాజకీయ ప్రవేశం చేశారు. ఆగస్ట్ 22న చెన్నై సమీపంలోని పనైయూర్‌లోని TVK ప్రధాన కార్యాలయంలో ఆయన తన పార్టీ జెండా, జెండా పాటను ప్రారంభించారు. మూడు వారాలలోపే, భారత ఎన్నికల సంఘం (ECI) తమిళగ వెట్రి కజగమ్‌ను రిజిస్టర్డ్ రాజకీయ పార్టీగా గుర్తించిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
రాజకీయాల్లో తన మార్గాన్ని స్పష్టం చేస్తూ విజయ్ అక్టోబర్ 27, 2024న తమ పార్టీ ద్రవిడం పేరు చెప్పుకునే పార్టీల అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుందని, అలాగే మతవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతుందని ప్రకటించారు. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలలో TVKని సంప్రదించే పార్టీలతో అధికారాన్ని పంచుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉందని కూడా విజయ్ తెలిపారు.
అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
"జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో కేసులు ఉన్నాయి.
నా మీద ఒక కేసు కూడా లేదు.
అలాంటిది వాడే సీఎం అవ్వగా లేనిది నేను అవ్వలేనా ??
మీరే చెప్పండి.
జగన్మోహన్ రెడ్డి లాగా దొంగలను, రేపిస్టులను పార్టీలో పెట్టుకొని నేను ప్రోత్సహించను..." అంటూ విజయ్ స్పీచ్ క్లిప్ ను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. విజయ్ తమిళ్ స్పీచ్ లో చెప్పింది ఒకటైతే, ఇక్కడ పెట్టిన పోస్టుల్లో వేరేగా ఉంది.
వైఎస్ జగన్ మీద విజయ్ ఏమైనా వ్యాఖ్యలు చేశారా అని తమిళ మీడియా సంస్థలను సంప్రదించాం.. ఎక్కడా కూడా అలాంటి ప్రస్తావన రాలేదంటూ తెలుసుకున్నాం. ఏ మీడియా సంస్థ కూడా ఎలాంటి నివేదికను ప్రచురించలేదు.
వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్ లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే క్లిప్ ను ట్విట్టర్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఆపాదించి పోస్టు పెట్టారని మేము గుర్తించాం.
"తెలంగాణ పేరు చెప్పి ఒక కుటుంబం ఎలా రాజకీయం చేసిందో దేశం మొత్తం చూసింది.
వల రాష్ట్రంలో స్కామ్ చేసి మన రాష్ట్రంలో ప్రచారం చేసుకున్నారు కానీ ప్రజలు నమ్మలేదు
అలాంటి రాజకీయం నేను చెయ్య - విజయ్" అంటూ Vennela Kishore Reddy అనే ట్విట్టర్ ఖాతాలో పోస్టును చూశాం.
వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్ లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే క్లిప్ ను ట్విట్టర్ లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఆపాదించి పోస్టు పెట్టారని మేము గుర్తించాం.
"తెలంగాణ పేరు చెప్పి ఒక కుటుంబం ఎలా రాజకీయం చేసిందో దేశం మొత్తం చూసింది.
వల రాష్ట్రంలో స్కామ్ చేసి మన రాష్ట్రంలో ప్రచారం చేసుకున్నారు కానీ ప్రజలు నమ్మలేదు
అలాంటి రాజకీయం నేను చెయ్య - విజయ్" అంటూ Vennela Kishore Reddy అనే ట్విట్టర్ ఖాతాలో పోస్టును చూశాం.
కాబట్టి, విజయ్ ఆవేశంగా మాట్లాడిన వీడియోను తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాలకు ఆపాదించి వైరల్ చేస్తున్నామని మేము గుర్తించాం.
వైరల్ వీడియోను VivaDubs అనే బాట్ ద్వారా వాయిస్ ను డబ్ చేయించారు. ఆ బాట్ నా గుండెల్లో మీరంతా ఉన్నారని విజయ్ చెప్పాడనేలా వాయిస్ ను ఇంగ్లీష్ లో డబ్ చేసింది. ఆ డబ్ లో ఎక్కడా కూడా విజయ్ కేసీఆర్, వైఎస్ జగన్ పేర్లను ప్రస్తావించలేదు.
విజయ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన పలు వీడియోలను మేము తమిళ న్యూస్ ఛానల్స్ లో చూశాం. అలాగే ఆంగ్ల మీడియా సంస్థలు కూడా విజయ్ స్పీచ్ ను నివేదించాయి. అయితే ఎక్కడా కూడా వైఎస్ జగన్, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తూ విజయ్ వ్యాఖ్యలు చేసినట్లు నివేదించలేదు.
ఇక వైరల్ వీడియోలో విజయ్ చేసిన వ్యాఖ్యలకు అర్థం '“నాకు తెలిసినంత వరకు అందరూ ఒక్కటే, మనం అంతా సమానులం. కాబట్టి, నా గుండెల్లో ఉన్న మీ అందరికీ నా వందనాలు” అని.
కాబట్టి, వైఎస్ జగన్, కేసీఆర్ కుటుంబాలను విజయ్ విమర్శించారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తమిళనటుడు విజయ్ విమర్శలు గుప్పించారు
Claimed By : social media users
Fact Check : False