ఫ్యాక్ట్ చెక్: అమెరికాలో కేసీఆర్ స్థిరపడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అమెరికాలో స్థిరపడబోతున్నట్లుగా;
![ఫ్యాక్ట్ చెక్: అమెరికాలో కేసీఆర్ స్థిరపడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు ఫ్యాక్ట్ చెక్: అమెరికాలో కేసీఆర్ స్థిరపడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు](https://www.telugupost.com/h-upload/2025/01/28/1500x900_1685171-kcr-usa-fact-check.webp)
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఇంట్లో ఇటీవల విషాదం నెలకొంది. ఆయన సోదరి సకలమ్మ మరణించారు. ఆమెకు కె.చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తన సోదరి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ K.T. రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కె.కవిత కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ సాకులమ్మకు నివాళులు అర్పించారు.
తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, కేసీఆర్ ఎక్కువగా తన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తున్నారు. అయితే ఆయన అమెరికాకు వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతూ ఉంది.
"అమెరికాలో స్థిరపడనున్న గులాబీ బాస్..!
ప్రత్యేక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం
న్యూయార్క్ లో చింతలపూడి శకుంతల దేవితో ఇంటి పక్కన కొత్త ఇల్లు కొనుగోలు
పెళ్లి కాకముందు నుండి శకుంతల దేవితో కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ షిప్ 2001 లోనే శకుంతల దేవిని సిద్దిపేట నుండి అమెరికా పంపించిన గులాబీ బాస్ నాటి నుండి నేటి వరకు ప్రతి దసరా పండక్కి ఎర్రవల్లి ఫాంహౌస్కు వచ్చి వెళ్తున్న శకుంతల దేవి కేసీఆర్ సహకారంతో న్యూయార్క్ వివిధ వ్యాపార సంస్థలను స్థాపించినట్టు తెలుస్తుంది" అంటూ వార్తా కథనంలో ఉంది.
తెలంగాణ న్యూస్ టుడే కథనంగా అందులో ఉంది. జనవరి 17న ఈ కథనం వచ్చినట్లు అందులో ఉంది.
పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఈ పోస్టు వైరల్ అయింది.
"అమెరికాలో స్థిరపడనున్న గులాబీ బాస్..!
ప్రత్యేక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం
న్యూయార్క్ లో చింతలపూడి శకుంతల దేవితో ఇంటి పక్కన కొత్త ఇల్లు కొనుగోలు
పెళ్లి కాకముందు నుండి శకుంతల దేవితో కేసీఆర్ క్లోజ్ ఫ్రెండ్ షిప్ 2001 లోనే శకుంతల దేవిని సిద్దిపేట నుండి అమెరికా పంపించిన గులాబీ బాస్ నాటి నుండి నేటి వరకు ప్రతి దసరా పండక్కి ఎర్రవల్లి ఫాంహౌస్కు వచ్చి వెళ్తున్న శకుంతల దేవి కేసీఆర్ సహకారంతో న్యూయార్క్ వివిధ వ్యాపార సంస్థలను స్థాపించినట్టు తెలుస్తుంది" అంటూ వార్తా కథనంలో ఉంది.
తెలంగాణ న్యూస్ టుడే కథనంగా అందులో ఉంది. జనవరి 17న ఈ కథనం వచ్చినట్లు అందులో ఉంది.
పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఈ పోస్టు వైరల్ అయింది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి కేసీఆర్ విదేశీ పర్యటనల గురించి కథనాల కోసం వెతికాం. మాకు ఎలాంటి మీడియా కథనాలు కూడా కనిపించలేదు. ఇటీవలి కాలంలో కేసీఆర్ ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదని మేము గుర్తించాం.
వైరల్ కథనంలో ఉన్నట్లుగా "ప్రత్యేక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం" అనే కీవర్డ్స్ తో కూడా మేము కథనాలు వెతికాం. కేసీఆర్ రాజకీయాలకు దూరమవుతున్నట్లుగా ఎలాంటి కథనాలు లభించలేదు. కేసీఆర్ త్వరలోనే యాక్టివ్ అవుతారని, మరోసారి ప్రజల్లోకి వస్తారని పలువురు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
కేసీఆర్ అమెరికాకు వెళుతున్నట్లుగా అటు బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలోనూ, బీఆర్ఎస్ నేతలు కూడా తెలపలేదు.
వైరల్ పోస్టులో ఉన్న telangananewstodaydaily.com లింక్ ను కూడా మేము వెతికాం. ఈ లింక్ తో ఉన్న మీడియా సంస్థకు సంబంధించిన వెబ్సైట్ లభించలేదు. అంతేకాకుండా telangananewstodaydaily.com డొమైన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. కాబట్టి ఇదొక ఫేక్ న్యూస్ పోర్టల్ కు సంబంధించిన లింక్ గా మేము ధృవీకరించాం.
“తెలంగాణ న్యూస్ టుడే డైలీ” అనే ఈ-పేపర్ యాక్టివ్ గా లేదని, ఈ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారంలో న్యూస్ క్లిప్పింగ్స్ ఫేక్ అని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ పోస్టులో ఉన్న 'చింతలపూడి శకుంతల దేవి' అనే మహిళ గురించి వివరాల కోసం వెతికాం. ఎలాంటి సమాచారం మాకు లభించలేదు.
ఈ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిజ నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
“తెలంగాణ న్యూస్ టుడే డైలీ” పేరుతో ఫేక్ కథనాలను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించాం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటి నుండి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవ్వలేదు. మునుపటిలా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. దీంతో పలు సందర్భాల్లో ఆయన గురించి వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు వీటిని ఖండిస్తూ వస్తున్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాలను వదిలి అమెరికాలో స్థిరపడబోతున్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అమెరికాలో స్థిరపడబోతున్నట్లుగా మీడియా కథనాలు
Claimed By : Social Media Users
Fact Check : False