ఫ్యాక్ట్ చెక్: రైతులు దాడి చేస్తారనే కారణంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దవ్వలేదు

రైతులు దాడి చేస్తారనే భయంతో;

Update: 2025-02-13 05:28 GMT
ఫ్యాక్ట్ చెక్: రైతులు దాడి చేస్తారనే కారణంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దవ్వలేదు
  • whatsapp icon

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం (ఫిబ్రవరి 11) సాయంత్రం రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. రాహుల్ పర్యటన నేపథ్యంలో అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయితే చివరి నిమిషంలో రాహుల్ తెలంగాణ పర్యటన రద్దయింది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండడంతో తెలంగాణ పర్యటనను రాహుల్ గాంధీ రద్దు చేసుకున్నారు.

రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఎజెండా ఏమిటో కాంగ్రెస్ వర్గాలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రాహుల్ వ్యక్తిగత కార్యక్రమం కోసం వరంగల్ వస్తున్నారని ప్రచారం జరిగినా కాంగ్రెస్, రాహుల్ గాంధీ సిబ్బంది మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.

అయితే రాహుల్ గాంధీ పర్యటన రద్దుకు కారణం ప్రజల తిరుగుబాటు అంటూ కొందరు పోస్టులు పెట్టారు

"మీ ప్రభుత్వం మీద
మీ హోంమంత్రి కం ముఖ్యమంత్రి మీద
మీకున్న అపారమైన నమ్మకానికి నిదర్శనం ఇవ్వాల మీ పర్యటన రద్దు @RahulGandhi గారు Shame on you GM @revanth_anumula" అంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా అందులో వే2న్యూస్ కథనం కూడా పంచుకున్నారు.

ఆ స్క్రీన్ షాట్ లో " రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ తెలంగాణ పర్యటన రద్దు
TG: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు వరంగల్లో పర్యటించడానికి సర్వం సిద్ధం అయింది. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత దృశ్య, రాహుల్ వస్తే ప్రజల నుండి ఏమైనా నిరసనలు దాడులు వచ్చే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. అందుకే రాహుల్ పర్యటన గురించి నిన్నటి వరకు ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఈరోజు రాహుల్ వరంగల్ పర్యటన వస్తారనే సమాచారం బయటకు పొక్కడంతో, వరంగల్ డిక్లరేషన్లో రైతులకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలా వస్తారని రైతులు ఆగ్రహంతో దాడి చెయ్యడానికి సిద్ధం అయ్యారని సమాచారం. దీనితో రాహుల్ గాంధీ పర్యటనని చివరి నిమిషంలో టీపీసీసీ వర్గాలు రద్దు చేశాయి." అని ఉంది.

Full View

Full View




వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. వే2న్యూస్ కథనం అంటూ వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ ను మార్ఫింగ్ చేశారు.

రాహుల్ గాంధీ పర్యటన రద్దుకు సంబంధించిన పలు మేడియా కథనాలను మేము పరిశీలించాం. అయితే ఎక్కడ కూడా 'రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ తెలంగాణ పర్యటన రద్దు' అంటూ వివరణను మేము చూడలేదు.

అయితే తెలంగాణలోని ప్రతి పక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రజల నుండి వచ్చే వ్యతిరేకత కారణంగానే రాహుల్ గాంధీ పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఆ కథనం ఇక్కడ చూడొచ్చు. 

కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు తగ్గుతోందనే కారణంతోనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితలు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందని, అయితే రాష్ట్రంలోని ప్రజల మానసిక స్థితిని పసిగట్టి దానిని రద్దు చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు ద్రోహానికి గురవుతున్నారన్నారు.


రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకున్నట్లు పలు మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. ఏ కథనంలో కూడా ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగానో, రైతులు దాడి చేస్తారనో ప్రస్తావించలేదు.  

ఇక వైరల్ ‘Way2News’ కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ https://way2.co/350brl అని ఉంది. దాన్ని ‘Way2News’ ఫాక్ట్-చెక్ వెబ్‌సైట్‌లో వెతకగా, ఈ ఐడీతో ఉన్న ఎటువంటి కథనం ‘Way2News’ వెబ్‌సైట్‌లో మాకు లభించలేదు.

ఇక వైరల్ ఫోటోను మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా

"Some miscreants with wrong intentions are spreading misinformation in our format. This is not a Way2News story.
#saynotofakenews" అంటూ వే2న్యూస్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వివరణ ఇచ్చింది. తప్పుడు ఉద్దేశ్యంతో కొందరు తమ సంస్థ కథనాల ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఇది వే2న్యూస్ కథనం కాదని స్పష్టం చేసింది.




కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదు.


Claim :  రైతులు దాడి చేస్తారనే భయంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News