ఫ్యాక్ట్ చెక్: లక్నోలో వందే భారత్ ట్రైన్ కు భారీ ప్రమాదం చోటు చేసుకుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
ఫిబ్రవరి నెలలో లక్నోలో వందేభారత్ ట్రైన్ కు;

కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, చుట్టుపక్కల నగరాలలో భారీ ట్రాఫిక్ జామ్ ను ఎదుర్కొంటున్నాయి. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి వంటి పవిత్రమైన రోజులలో మూడు ముఖ్యమైన 'అమృత స్నానాలు' పూర్తయినప్పటికీ రోడ్లపై ఊహించని ట్రాఫిక్ ఉంది. ఇక రైల్వే స్టేషన్స్ లో కూడా రద్దీ పెరిగిపోయింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన తర్వాత కూడా మహా కుంభమేళా కోసం రైళ్లలో వెళ్లడానికి ప్రయాణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. పలు రైల్వే స్టేషన్స్ లో రద్దీ ఏర్పడింది. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని వివిధ రైల్వే స్టేషన్లు కూడా ఇప్పుడు అప్రమత్తమయ్యాయి.
లక్నోలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు యాక్సిడెంట్ అయిందంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు. లక్నోలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్, మరొక రైలు ఢీకొన్న సంఘటన అంటూ బహుళ సోషల్ మీడియా వినియోగదారులు ఒక వీడియోను పంచుకున్నారు.
లక్నోలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, మరొక రైలు మధ్య ఇటీవల ఢీకొన్న సంఘటనను చూపించినట్లు పేర్కొంటూ వీడియోలను పోస్టు చేస్తున్నారు. అలాగే వీడియో మీద టెక్స్ట్ హిందీలో ఉంది “వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2:00 గంటలకు, లక్నోలో ప్రమాదం” అనే అర్థం వచ్చేలా ఆ ఉన్నాయి. పోస్టులు
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియోకు భారత్ కు ఎలాంటి సంబంధం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. చిలీలో చోటు చేసుకున్న ప్రమాదాన్ని భారత్ లో చోటు చేసుకున్నదిగా ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల వందే భారత్ ట్రైన్ కు లక్నోలో ప్రమాదం జరిగిందా అనే విషయాన్ని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాం. మాకు ఎలాంటి నివేదికలు కనిపించలేదు.
ఇక వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా చిలీలో చోటు చేసుకున్న ఘటన అంటూ పలు నివేదికలు లభించాయి.
ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ లో Two killed as Chilean train on test run collides with cargo train అనే టైటిల్ తో June 21, 2024న కథనాన్ని మేము గుర్తించాం.
చిలీ స్టేట్ రైల్వే కంపెనీ (EFE) టెస్ట్ రన్‌లో ప్యాసింజర్ రైలు కార్గో రైలును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. తొమ్మిది మంది గాయపడ్డారని కథనంలో ఉంది. రాజధాని శివార్లలోని శాన్ బెర్నార్డో ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే, EFE రైలు ఫెపాసా రైలును ఢీకొట్టింది. నలుగురు చైనీస్ జాతీయులతో సహా గాయపడిన వారు రైలు టెస్టింగ్ సిబ్బందిలో భాగంగా ఉన్నారు. గాయపడ్డ వారికి వైద్య చికిత్స అందించారు. వైరల్ కథనంలోని విజువల్స్, రాయిటర్స్ కథనంలోని వీడియో ఒకేలా ఉందని మేము నిర్ధారించాం. మరణించిన ఇద్దరు వ్యక్తులు ఫెపాసా కార్గో రైలు ఆపరేటర్లని EFE ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంపై విచారణలో భాగంగా స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం ఇద్దరు EFE అధికారులను అదుపులోకి తీసుకుంది.
Chile train collision kills at least 2 people, injures several others అనే టైటిల్ తో అసోసియేటెడ్ ప్రెస్ కూడా వీడియోను అప్లోడ్ చేసింది. చిలీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు చనిపోయారంటూ నివేదించారు.
చిలీ రాజధాని శాంటియాగో వెలుపల టెస్ట్ రన్ చేయగా ఒక రైలు మరొక రైలును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు, తొమ్మిది మంది గాయపడ్డారని వీడియో వివరణలో చూశాం.
ఇక వైరల్ వీడియోకు లక్నోకు ఎలాంటి సంబంధం లేదంటూ PIB Fact Check టీమ్ నివేదించింది. జూన్ 20, 2024లో చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ను ఇటీవలివిగా పోస్టు చేసినట్లు ధృవీకరించారు.
వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, చిలీ రాజధాని శాంటియాగో వెలుపల టెస్ట్ రన్ సమయంలో చోటు చేసుకున్న ప్రమాదాన్ని లక్నోలో చోటు చేసుకున్న ప్రమాదంగా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి
Claim : చిలీ దేశంలో 2024లో చోటు చేసుకున్న ప్రమాదం
Claimed By : Social Media Users
Fact Check : False