ఫ్యాక్ట్ చెక్: విజయవాడలో వరదల పరిస్థితి ఇదని చూపుతూ వైరల్ అవుతున్న వీడియో తప్పుదారి పట్టిస్తోంది

కరకట్టలో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా

Update: 2024-09-04 03:39 GMT
గత వారంలో కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉధృతమైన వరదలకు కారణమయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ఏలూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్థమైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 6.4 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 44,000 మందికి పైగా 190 సహాయ శిబిరాల్లో తలదాచుకోవలసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదు హెలికాప్టర్లతో తన వనరులను సమీకరిస్తోంది.

భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో విజయవాడలోని పలు ప్రాంతాన్ని వరద ముంచేసింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వదర నీరు వచ్చింది. దీని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. వరదల కారణంగా అతలాకుతలమైన నగరాన్ని సోమవారం సందర్శించిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కరకట్టపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిథి గృహం నీటమునిగిపోకుండా కాపాడేందుకు టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వమే విజయవాడను ముంచెత్తిందని ఆరోపించారు.

ఈ ఆరోపణల మధ్య, అనేక మంది వినియోగదారులు విజయవాడలో వరదలకు సంబంధించిన విజువల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వరద ముప్పు తగ్గాక బుడమేరు గురించి చాలా చర్చ చేయాలన్నారు.

"కరకట్ట సేఫ్టీ కోసం బుడమేరు గేట్స్ తెరిచారు అని చర్చ… ఒకవేళ అదే నిజం అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్ర లోనే అతిపెద్ద చరిత్ర హీనుడు అవుతాడు…" అంటూ పోస్టులు పెట్టారు.

Full View


Full View




ఫ్యాక్ట్ చెకింగ్:

విచారణలో, తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్-చెక్ బృందం ఈ వాదన తప్పుదారి పట్టించేదిగా గుర్తించింది.

కొన్ని రోజుల క్రితం.. తమ దేశంలో వరదలకు భారత్ కారణమైందని ఆరోపించిన బంగ్లాదేశ్ వినియోగదారుల తప్పుదోవ పట్టించే వాదనను మా బృందం తోసిపుచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, బంగ్లాదేశ్ సోషల్ మీడియా వినియోగదారులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ శైలం డ్యామ్ వీడియోను పంచుకున్నారు. ఇది త్రిపురలోని డంబూర్ డ్యామ్ అని పేర్కొంటూ పొరుగు దేశంలో భారీ వరద నీటిని విడుదల చేసినట్లు ఆరోపించారు.

ఇటీవలి వర్షాలు బంగ్లాదేశ్‌లోని మధ్య, తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 59 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదు మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.

బంగ్లాదేశ్ ప్రజలు భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితులను ఎదుర్కొంటుండగా, భారతదేశంలోని కొంతమంది వినియోగదారులు వారిని ఎగతాళి చేయడానికి వైరల్ వీడియోను పంచుకోవడం ప్రారంభించారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు విద్యార్థుల ఉద్యమంలో హిందువులను లక్ష్యంగా చేసుకున్నందున వారిపై ప్రకృతి ఇలా ప్రతీకారం తీర్చుకుందంటూ పోస్టులు పెట్టారు.

"सुनने में आ रहा है कि बांग्लादेश अपने पापों के बाढ़ में बह गया
क्या यह सच है ? अगर सच है तो पापों का फल फल गया फिर तो और करो हिंदुओं का कत्लेआम और उनकी बेटियों का बलात्कार यह तो बस शुरुआत है #FloodInBangladesh" అంటూ ఎక్స్ వినియోగదారులు పోస్టులు పెట్టారు.



క్లెయిమ్‌ను పరిశోధించడానికి, మేము వీడియో నుండి కీ ఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను అమలు చేసాము. వైరల్ వీడియో బంగ్లాదేశ్ గురించి కాదని, పాకిస్తాన్‌కు చెందినదని కనుగొన్నాము. వైరల్ వీడియో డ్రోన్ వ్యూలో చూపిన ప్రదేశం 'కీంజర్ సరస్సు' లేదా 'కర్లీ సరస్సు' అని కూడా పిలుస్తారు. స్థానికులకు పర్యాటక కేంద్రంగా ఉపయోగపడే ఈ సరస్సు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా జిల్లాలో ఉంది.

లాహోర్‌కు చెందిన ఈ GNN వార్తా ఛానెల్ వారి Facebook పేజీలో 'కీంజర్ సరస్సు' వీడియోను పోస్ట్ చేసింది. వేసవిలో వేడి పెరగడంతో, పర్యాటకులు తట్టా 'కీంజర్' సరస్సు జలాల వద్దకు వచ్చారు. వీడియోలో జనంతో కిక్కిరిసిపోయిన సరస్సును చూడవచ్చు.

Full View


Full View



వైరల్ అయిన డ్రోన్ వీడియో భారతదేశానికి చెందినది కాదని, విజయవాడ వరదలకు సంబంధించింది కాదని తెలుస్తోంది. కాబట్టి, వైరల్ వీడియో ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.


Claim :  కరకట్టలో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా బుడమేరు గేట్లు తెరవడంతో విజయవాడను వరదలు తాకాయి
Claimed By :  social media users
Fact Check :  False
Tags:    

Similar News