ఫ్యాక్ట్ చెక్: ఛార్జింగ్ పెట్టుకొని ల్యాప్ టాప్ వాడితే క్యాన్సర్ వస్తుందా..?
ఈ వీడియోలో.. ఒక యువకుడు మంచం మీద కూర్చుని, ఛార్జింగ్ లో ఉన్న ల్యాప్‌టాప్ తో పని చేస్తున్న యువతి భుజాలపై చేయి వేసినప్పుడు కొద్దిగా విద్యుత్ షాక్‌కు గురైనట్లు తెలిపాడు
@fenoogreek అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కు సంబంధించిన ఓ వీడియో WhatsAppలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ఒక యువకుడు మంచం మీద కూర్చుని, ఛార్జింగ్ లో ఉన్న ల్యాప్‌టాప్ తో పని చేస్తున్న యువతి భుజాలపై చేయి వేసినప్పుడు కొద్దిగా విద్యుత్ షాక్‌కు గురైనట్లు తెలిపాడు.
అతను ఒక హ్యాండ్‌హెల్డ్ పరికరాన్ని తీసుకుని, స్త్రీని తన చేతిని దాని దగ్గరికి తీసుకురావాలని కోరగా.. ఆమె అలా చేసినప్పుడు, ఆ పరికరం ఆమెపై విద్యుత్ ప్రవాహం జరుగుతోందనే రుజువును చూపిస్తుంది. ఆ వ్యక్తి పేర్కొన్న రీడింగ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి రేడియేషన్ ప్రవహించి మన శరీరంలో క్యాన్సర్‌కు కారణమవుతుందని ఆ యువకుడు చెప్పడంతో వీడియో ముగుస్తుంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఛార్జింగ్ పెట్టుకొని ల్యాప్ టాప్ వాడడం వలన క్యాన్సర్ వస్తుందని చెప్పే ఎటువంటి పరిశోధనకు సంబంధించిన వివరాలు మాకు లభించలేదు. నిపుణులు కూడా ఈ విషయాన్ని తెలిపారు.నాన్-అయోనైజింగ్ రేడియేషన్ కారణంగా క్యాన్సర్ వ్యాపించదని నిపుణులు కూడా స్పష్టం చేశారు.
అనేక అధ్యయనాలు ELF రేడియేషన్, క్యాన్సర్ మధ్య లింక్ లకు సంబంధించిన అవకాశాలను పరిశీలించారు. ELF రేడియేషన్‌కు గురికావడం వలన క్యాన్సర్‌కు కారణమవుతుందనే వాదనకు ఎటువంటి ఆధారాలు వారు నివేదించలేదు.
ELF అయస్కాంత క్షేత్రం (విద్యుత్ క్షేత్రం కాదు) కారణంగా ల్యుకేమియాకు గురికావడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు ఈ వాదనలను కూడా ఖండించారు. WHO టాస్క్ గ్రూప్ కూడా ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
ఆధునిక మానవుడి జీవితంలో విద్యుత్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సర్వసాధారణంగా మారాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్‌లు, ఎయిర్ కండిషనర్లు మొదలైన ఎలక్ట్రిక్ ఉపకరణాలు.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్ లు ELF రేడియేషన్‌ను మాత్రమే విడుదల చేస్తాయి. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని భావించాల్సిన అవసరం లేదు.
వాట్సాప్ వీడియో లో చెప్పే భయంకరమైన వాదనను సమర్థించడానికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగించడం వల్ల క్యాన్సర్ రాదు.
కాబట్టి వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి నిజం లేదు.
క్లెయిమ్: ఛార్జింగ్ పెట్టుకొని ల్యాప్ టాప్ వాడితే క్యాన్సర్ వస్తుందా..?
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : Could Using a Laptop While It's Charging Cause Cancer?
Claimed By : Social Media Users
Fact Check : False