ఫ్యాక్ట్ చెక్: ట్రైన్ లో జరిగిన పాత సంఘటన ను ఇటీవల చోటు చేసుకుందిగా ప్రచారం చేస్తున్నారు

భారతీయ రైల్వే వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలలో ఎలాంటి లైసెన్స్‌లు లేకుండా వస్తువులను విక్రయించడం. ఏ స్టేషన్ పడితే ఆ స్టేషన్;

Update: 2025-03-17 10:40 GMT
Indian Train

 Indian Train

  • whatsapp icon

భారతీయ రైల్వే వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలలో ఒకటి, లైసెన్స్‌లు లేకుండా వస్తువులను విక్రయించేవారు. ఏ స్టేషన్ పడితే ఆ స్టేషన్ లో కొందరు రైళ్లలోకి ఎక్కేసి అమ్మకాలు జరుపుతూ ఉంటారు. అనధికార విక్రేతలు ప్రయాణీకుల నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. నాణ్యత లేని లేదా అనుమతి లేని ఉత్పత్తులను అమ్మడం ద్వారా ప్రజా భద్రతను ప్రమాదంలో పడవేస్తుంది. అలాగే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. భారతీయ రైళ్లు, రైల్వే ప్రాంగణాలలో అనధికార విక్రయాలను ఇప్పటికే నిషేధించారు. రైల్వే చట్టం ప్రకారం నేరం కూడా. ఈ అనధికార విక్రయాలను అరికట్టడానికి భారత రైల్వే చర్యలు తీసుకుంది.

రైలులో అనధికారంగా నీటి బాటిళ్లను అమ్ముతున్న కొంతమంది వెండర్స్ ను చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఇటీవలిదని, కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన సంఘటన అని నెటిజన్లు చెబుతున్నారు. అక్కడ ఒక ప్రయాణీకుడు ఈ విక్రేతలను ప్రశ్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. భారతీయ రైల్వేలు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను పలువురు ట్యాగ్ చేస్తూ ఈ వీడియోను షేర్ చేశారు. ఏసీ కంపార్ట్‌మెంట్‌లో అనధికారికంగా వాటర్ బాటిళ్లు అమ్ముతున్న విక్రేతలను, రైలులోకి ప్రవేశించిన పాన్ మసాలా విక్రేతలను ప్రయాణికులు ప్రశ్నించారు. తరువాత ప్యాంట్రీ మేనేజర్ సంఘటనా స్థలానికి చేరుకుని, రికార్డింగ్ ఆపమని ప్రయాణీకుడిని కోరుతాడు. క్యాటరింగ్ నిర్వహణ సరిగా లేదని ప్రయాణీకుడు మేనేజర్‌పై విమర్శలు గుప్పించాడు. 
“ट्रेन में लोकल पानी बेचने पर हुआ बवाल, यात्री ने बनाया वीडियो #indianrailway #viralvideo #breakingnews #aajnewjdekhakya” అనే క్యాప్షన్స్ తో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి.

“इस वीडियो को देखकर ऐसा लगता है कि हमारी ट्रेनों में ऐसे रैकेट सक्रिय हो गए हैं जो नकली पानी और नकली खाद्य समान बेचकर रेल यात्रियों के स्वास्थ्य के साथ खिलवाड़ कर रहे हैं रेल मंत्री
@AshwiniVaishnaw ....जी इन पर कार्रवाई कीजिए ये नकली सामान भी महंगे दामों पर बेचकर यात्रियों की मजबूरी का फायदा उठाते हैं। ये वीडियो कुर्ला एक्सप्रेस का बताया जा रहा है, हांलाकि घटना की तारीख साफ नहीं है। @RailMinIndia @AshwiniVaishnaw @RailwaySeva #AshwiniVaishnaw #railwayminister #viralvideo అంటూ పలువురు పోస్టులు పెట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా రైళ్లలోకి ఎక్కి అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.

ఫ్యాక్ట్ చెక్:

ఈ వాదన తప్పుదారి పట్టిస్తోంది. వైరల్ వీడియో పాతది. ఇది రైలు లోపల ఇటీవల చోటు చేసుకున్న సంఘటన కాదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వెతికాం. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నట్లు తెలుసుకున్నాం. “Viral video of one of the Indian railways, Indianrailwayoffical” అనే శీర్షికతో జనవరి 6, 2024న ఫేస్‌బుక్‌లో ప్రచురించి న వైరల్ వీడియోను మేము కనుగొన్నాము.
Full View
“Video | Unapproved branded bottled water being sold in 20104 – Mumbai LTT SF Express, instead of Rail Neer as mandated by the Railways. Clip by Activist Jitendra Gupta.” అనే క్యాప్షన్ ద్వారా ఇదే వీడియోను జనవరి 12, 2024న ఒక X హ్యాండిల్ లో పోస్టు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ముంబై ఎల్ టీ టీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో వాటర్ బాటిల్స్ ను అమ్ముతున్నారని అందులో తెలిపారు రైలు ప్రయాణీకులకు రైల్ నీర్ ను అందించాల్సి ఉంటుందని అందులో తెలిపారు.
జనవరి 13, 2024న కూడ “Unapproved branded bottled water being sold in 20104 – Mumbai LTT SF Express” అనే శీర్షికతో వీడియోను షేర్ చేశారు.
Full View
కానీ ఆ వీడియోను నవంబర్ 26, 2023న “ट्रैन में नकली पानी बेचने पर ट्रैन यात्री ने सिखाया पेंट्री मेनेजर को सबक” అనే క్యాప్షన్ తో ఫేస్‌బుక్‌లో విజన్ న్యూస్ అనే యూజర్ షేర్ చేశారు.
Full View
వీడియో రికార్డు చేసిన స్థలం, ఖచ్చితమైన తేదీ గురించి మాకు తెలియకపోయినా, ఆ వీడియో నవంబర్ 2023 నుండి ఆన్‌లైన్‌లో ఉంది. రైలులో అనధికార విక్రేతలు నీటి బాటిళ్లను అమ్ముతున్నట్లు చూపించే వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఈ వాదన తప్పుదారి పట్టిస్తోంది
Claim :  భారతీయ రైల్వేలో అనుమతులు లేకుండా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By :  Twitter users
Fact Check :  Misleading
Tags:    

Similar News