ఫ్యాక్ట్ చెక్: తిరుపతి నుండి తిరుమలకు రిలయన్స్ సంస్థ కేవలం 2388 మెట్లతో మార్గాన్ని నిర్మించలేదు.
తిరుమల ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఒక ఆధ్యాత్మిక పట్టణం. ఏడుకొండల పైన ఉన్న తిరుమలలోని లార్డ్ వేంకటేశ్వర ఆలయానికి ప్రతిరోజూ లక్షలాది మంది యాత్రికులు వస్తుంటారు. కొందరు భక్తులు వాహనాల్లో ఆలయానికి వెళ్తే, మరికొంత మంది మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకుంటారు.

“తిరుమలకు కాలి నడకన పోయే వారికోసం రిలయన్స్ వారు నిర్మించిన కొత్త మార్గం. దీని ద్వారా మనం కేవలం 2,388 మెట్లలో తిరుమల చేరుకోవచ్చు. పాత మార్గం ద్వారా అయితే 6,588 మెట్లు ఎక్కవలసి వచ్చేది. కాలి నడకన తిరుమల వెళ్ళాలి అనుకొనే అందరి కోసం ఈ సమాచారాన్ని షేర్ చేసి స్ప్రెడ్ చేయండి. శుభోదయం. జై శ్రీమన్నారాయణ.” అంటూ కొందరు పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
“శ్రీవారి మెట్టు కాలిబాట ప్రారంభ ప్రదేశం. మొత్తం మెట్లు: 2388, తిరుమలకు దూరం 2.1కిమీ” రిలయన్స్ గ్రూప్ దీనిని నిర్మించిందని, తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి ఇదొక మార్గం అని వైరల్ వాదనతో భాగస్వామ్యం చేశారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
“శ్రీవారి మెట్టు టు తిరుమల” అనే కీవర్డ్‌లతో వైరల్ అవుతున్న పోస్టుల కోసం మేము సెర్చ్ చేసినప్పుడు తిరుమలకు ఈ నడక మార్గం ప్రాముఖ్యతను వివరిస్తూ అనేక ఫలితాలు కనిపించాయి.
ysrcppolls.inలో ప్రచురితమైన కథనం ప్రకారం, తిరుమలకు వెళ్లేందుకు శ్రీవారి మెట్టు మార్గంను పలువురు యాత్రికులు ఎంచుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ శ్రీవారి మెట్టు మార్గం గుండా ప్రయాణించి తిరుమల చేరుకున్నారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
శ్రీవారి మెట్టు మార్గం శ్రీనివాస మంగాపురం నుండి అతి తక్కువ సమయంలో వెళ్ళవచ్చు. తక్కువ దూరం కూడా..! ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ మార్గం గుండా తిరుమలకు వెళుతూ ఉంటారు. దీంతో ఈ కాలినడకన మార్గంలో సౌకర్యాలు, భద్రతను మెరుగుపరిచారు.
శ్రీవారి మెట్టు అలిపిరి మెట్ల దారి కంటే చాలా పురాతనమైన మార్గం. పూర్వం ఎంతో మంది పాదచారులు ఎక్కువగా దీనినే ఉపయోగించేవారు. దీనిని 16వ శతాబ్దంలో చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు ఉపయోగించారని నమ్ముతారు.
కొన్ని సంవత్సరాల క్రితం TTD దీనిని పునరుద్ధరించడానికి పనులు మొదలుపెట్టారు. దీంతో చాలా సంవత్సరాలు ఉపయోగించలేదు. అక్కడ వసతులలో చాలా మార్పులు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆ మార్గాన్ని ఉపయోగించమని టీటీడీ యాత్రికులను ప్రోత్సహించడం ప్రారంభించింది.
https://www.newindianexpress.
అలిపిరి నుంచి తిరుమలకు 6,588 మెట్లు ఉన్నాయన్న వాదన కూడా అవాస్తవం. ఈ మార్గం 9 కి.మీ ఉంటుంది.. 3,550 మెట్లు మాత్రమే ఉన్నాయి. అలిపిరి నడక మార్గం 24 గంటలు తెరిచి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గం ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.
https://myoksha.com/tirumala-
http://ttdseva.in/tirumala-
ఈ క్లెయిమ్ 2021లో కూడా వైరల్ అయింది. అనేక ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ వాదనలను తిరస్కరించాయి.
Claim : walkpath to Tirumala recently built by Reliance
Claimed By : Social Media Users
Fact Check : False