ఫ్యాక్ట్ చెక్: తెలంగాణ రైతన్నకు సంబంధించిన వీడియో కాదు.. అదొక షార్ట్ ఫిల్మ్ లోనిది
తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వర్షంలో పంట తడవడంతో నష్టపోయిన ఓ రైతు దయనీయ స్థితిని తెలిపే వీడియోను ట్విట్టర్ యూజర్లు షేర్ చేశారు. "భయంకరమైన పిడుగుల కారణంగా తెలంగాణ రైతులకు ఊహించని నష్టం" అనే వాదనతో వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు. కొన్ని ఇతర ట్విట్టర్ ఖాతాలలో కూడా దీనికి ట్యాగ్ చేశారు. “రైతన్న దుఃఖం రాష్ట్రనికి మంచిది కాదు”, అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదారి పట్టించేది. తెలంగాణలో అకాల వర్షాల కారణంగా చాలా పంటలు దెబ్బతిన్నప్పటికీ, వైరల్ అవుతున్న వీడియో షార్ట్ ఫిల్మ్ లోనిది. ఆ వీడియోను మీరు యూట్యూబ్‌లో చూడవచ్చు.2021 నవంబర్‌లో ఈ వైరల్ వీడియోను చాలా మంది వ్యక్తులు షేర్ చేశారు. 2021 నవంబర్‌లో కురిసిన వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతులను పరామర్శిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసినప్పుడు, పసుల సుధాకర్ అనే వ్యక్తి యూట్యూబ్ వీడియోను షేర్ చేశాడు. 'రైతన్న శోకం' అని పేరు ఉన్న షార్ట్ ఫిల్మ్ లో ఈ సన్నివేశం ఉంది.మేము యూట్యూబ్ లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, PS Creations అనే యూట్యూబ్ ఛానెల్ లో ఏప్రిల్ 2020లో షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేశారని గుర్తించాం. కనిపించింది . ఆ వీడియోకు “Pasula Sudhakar II Raithanna Shokam II emotional short film” అనే టైటిల్ ఉంది. పోస్ట్ చేసిన వీడియో ఒక షార్ట్ ఫిల్మ్ అని టైటిల్ లోనే స్పష్టంగా చూశాం.
షేర్ చేసిన వీడియోను 3 సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన షార్ట్ ఫిల్మ్‌లో భాగం. తెలంగాణలో ఇటీవలి వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నట్లు చూపించలేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉంది.
Claim : video shows the plight of farmers in Telangana due to heavy rain
Claimed By : Twitter Users
Fact Check : Misleading