ఫ్యాక్ట్ చెక్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంపై తప్పుడు ప్రచారం

తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఇద్దరూ ఇస్లామిక్ ప్రార్థనలు మాత్రమే చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Update: 2023-06-22 04:30 GMT

తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఇద్దరూ ఇస్లామిక్ ప్రార్థనలు మాత్రమే చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వేడుకలో మరే ఇతర మతపరమైన ప్రార్థనలు జరగలేదని, కేవలం ఇస్లామిక్ ఆచారాలు మాత్రమే పాటించారని నెటిజన్లు అంటున్నారు. 'ఇస్లామైజేషన్ ఆఫ్ ఇండియా'ను ఇది చూపుతుందని నెటిజన్లు చెబుతున్నారు.

https://www.facebook.com/reel/
255683303722798

ఫ్యాక్ట్ చెకింగ్:

మేము టి న్యూస్ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని తనిఖీ చేసాము. ప్రత్యక్ష ప్రసారంలో సర్వమత ప్రార్థనలు చేశారు. ఇస్లామిక్ ఆచారాలు, హిందూ, క్రైస్తవ మతపరమైన ఆచారాలను నిర్వహించడాన్ని స్పష్టంగా గమనించవచ్చు. వీడియోలో 1:23 వద్ద హిందూ ఆచారాలను, 1:28 వద్ద ఇస్లామిక్ ఆచారాలను, 1:29 వద్ద క్రైస్తవ ఆచారాలను చేయడం చూడవచ్చు. ప్రారంభోత్సవం సమయంలో హిందువుల పూజ, ఇస్లామిక్, క్రైస్తవ ప్రార్థనలు జరిగాయి.

Full View


తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లోని ఫోటోగ్రాఫ్‌లు కూడా ఈ కార్యక్రమంలో హిందూ సాధువులు ఉండడాన్ని చూపుతూ ఉన్నాయి.

వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని స్పష్టమవుతోంది. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సమయంలో ఇస్లామిక్ ఆచారాలు మాత్రమే కాకుండా హిందూ, క్రైస్తవ ఆచారాలను కూడా పాటించారు.
Claim :  Only Islamic rituals were performed at the inauguration ceremony of the collector's office in Nirmal
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News