ఫ్యాక్ట్ చెక్: ఇటీవల కురిసిన వర్షాలకు చెన్నైలోని సత్యభామ కాలేజీ మునిగిపోలేదు, వీడియో పాతది

చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు;

Update: 2024-10-23 08:15 GMT
Sathyabhama Engineering College, Floods in Sathyabhama Engineering College, Chennai Floods, factcheck news telugu

Sathyabhama Engineering College

  • whatsapp icon

చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు రోజువారీ జీవితం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి ప్రజా రవాణా సేవలు నిలిచిపోయాయి. పలు విమానాలను కూడా రద్దు చేయాల్సి వచ్చింది. అయితే సంబంధిత అధికారుల కృషితో పాటు, ముందుగానే వర్షాలు ఆగిపోవడంతో నగరంలోని చాలా ప్రాంతాలు ఒక్కరోజులోనే తేరుకున్నాయి.

భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ అందరూ భయపడిన విధంగా తుపానుగా మారలేదు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తమిళనాడుపై పడనుంది.
చెన్నై, తమిళనాడును వర్షాలు ముంచెత్తడంతో, కొన్ని పాత వీడియోలు తప్పుడు వాదనలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నై లోని సత్యభామ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రస్తుత పరిస్థితిని చూపుతుందనే వాదనతో యువకులు తమ సామాను చెక్క దుంగలపై తీసుకుని వెళుతూ, చాతి లోతు నీటిలో నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఊహించని వర్షాల కారణంగా సత్యభామ కాలేజీలోని చాలా ప్రాంతం నీటితో మునిగిపోయిందని, విద్యార్థులు ఇబ్బందులు పెడుతున్నారంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.



Full View

Full View
V6 వంటి తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెల్‌ల యూట్యూబ్ ఛానెల్‌లు కూడా ఇదే వీడియోను షేర్ చేశాయి.

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. ఈ వీడియో 2023 సంవత్సరం నాటిది.
తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ విభాగం వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా శోధించింది. మమ్మల్ని ‘‘@satyabhama flood 2023… Chennai@michaung’’ అనే శీర్షికతో డిసెంబర్ 15, 2023న ప్రచురించిన యూట్యూబ్ వీడియో మేము చూశాం. దీనిని ముస్కాన్ సింగ్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించారు. ఇందులో పలువురు యువకులు వారి లగేజీతో పాటు వరద నీటిలో ఈదుతున్నట్లు చూడొచ్చు .
Full View
తదుపరి పరిశోధనలో వైరల్ వీడియో యొక్క పొడవైన వెర్షన్ సత్యభామైట్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చూశాం. 'మేము సర్వైవ్ అయ్యాము' అనే క్యాప్షన్‌తో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియోను డిసెంబర్ 6, 2023న అప్లోడ్ చేశారు. ఈ Instagram ఖాతా వీడియో సృష్టికర్తలు సత్యభామ విశ్వవిద్యాలయానికి చెందినవారు. 2023లో వచ్చిన మిచాంగ్ తుఫాను సమయంలో వరదలు ముంచెత్తిన సత్యభామ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్‌ను వీడియోలో చూడొచ్చు.
అశోక్ రెడ్డి వ్లాగ్స్ అనే ఛానెల్‌లో మరొక యూట్యూబ్ వీడియోలో ఇలాంటి వీడియోలను మనం చూడవచ్చు. ఈ వీడియోలో కూడా అలాంటి విజువల్స్ ఉన్నాయి.
Full View
News.career360.com అనే వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన కథనం ప్రకారం చెన్నైలోని మైచాంగ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షపాతం కారణంగా సెయింట్ జోసెఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన చాలా మంది విద్యార్థులు హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. కొందరు తిండి, కరెంటు లేకుండా రెండు రోజుల పాటూ హాస్టల్‌లోనే ఉండాల్సి వచ్చింది.
వారి పరిస్థితిని గమనించిన ఆ ప్రాంత వాసులు వారికి అవసరమైన సామాగ్రిని అందించి సమీపంలోని బస్టాప్‌లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదు, 2023 సంవత్సరానికి చెందినది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  వైరల్ వీడియో చెన్నైలోని సత్యభామ కాలేజీ ఇటీవలి వర్షాలకు మునిగిపోయింది
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News