ఫ్యాక్ట్ చెక్: ప్యాక్ చేసిన గోధుమపిండిలో పురుగులు పడకుండా బెంజాయిల్ పెరాక్సైడ్ ను వినియోగిస్తారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
హిందీ భాషలో ప్యాక్ చేసిన గోధుమ పిండిలో పురుగులు పడకుండా రసాయనాలను కలుపుతారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
హిందీ భాషలో ప్యాక్ చేసిన గోధుమ పిండిలో పురుగులు పడకుండా రసాయనాలను కలుపుతారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. పెద్ద కంపెనీలు తయారు చేసే గోధుమ పిండిలో మనుషులకు హాని కలిగించే బెంజాయిల్ పెరాక్సైడ్ ఉందంటూ హిందీలో ఒక సందేశం ఫేస్‌బుక్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ప్యాక్ చేసిన పిండిలో కీటకాలు అందుకే పడవని చెప్పుకొచ్చారు.“पैकिंग आटा में #कीड़े क्यों नही पड़ते ??आंखें खोल देने वाला सच --- एक प्रयोग करके देखें । गेहूं का आटा पिसवा कर उसे 2 महीने स्टोर करने का प्रयास करें।,आटे में कीड़े पड़ जाना स्वाभाविक हैं, *आप आटा स्टोर नहीं कर पाएंगे।* फिर ये बड़े बड़े ब्रांड आटा कैसे स्टोर कर पा रहे हैं? यह सोचने वाली बात है।एक #केमिकल है- #बेंजोयलपर #ऑक्साइड, जिसे ' फ्लौर इम्प्रूवर ' भी कहा जाता है।* इसकी #पेरमिसीबल लिमिट 4 मिलीग्राम है, लेकिन आटा बनाने वाली फर्में 400 मिलीग्राम तक ठोक देती हैं। कारण क्या है? आटा खराब होने से लम्बे समय तक बचा रहे। *बेशक़ उपभोक्ता की किडनी का बैंड बज जाए। कोशिश कीजिये खुद सीधे गेहूं खरीदकर अपना आटा पिसवाकर खाएं।नियमानुसार आटे का समय..ठंडके दिनों में 30 दिनगरमी के दिनोंमें 20 दिनबारिस के दिनों में 15 दिन का बताया गया है।ताजा आटा खाइये, स्वस्थ रहिये...समझदार बनें, अपने लिए पुरुषार्थी बन सभी #गेंहू पिसवा कर काम ले।न कोई रेडीमेड थैली का केवल 3 बदलाव कर के देखे 1.) नमक सेंधा प्रयोग करे,2.) आटा #चक्की से पिसवा कर लाये,3.) पानी #मटके का पिये,सुबह गर्म पानी पिये...आधी बीमारियों से छुटकारा पाएंगे “ అంటూ హిందీలో పోస్టు పెట్టారు.“ప్యాకింగ్ పిండిలో పురుగులు ఎందుకు పడవు?? కళ్ళు తెరిపించే నిజం --- ఒక ప్రయోగం చేశాం. గోధుమ పిండిని మెత్తగా చేసి 2 నెలలు నిల్వ చేసి చూడండి.. పిండిలో పురుగులు పడిపోవడం సహజం, * మీరు పురుగులు పడకుండా పిండిని నిల్వ చేయలేరు. * అలాంటప్పుడు ఈ పెద్ద బ్రాండ్లు పిండిని ఎలా నిల్వ చేయగలుగుతున్నాయి? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఒక రసాయనం ఉంది, దీనిని 'ఫ్లోర్ ఇంప్రూవర్' అని కూడా పిలుస్తారు.* దీని అనుమతించదగిన పరిమితి 4 mg, కానీ పిండి తయారీ సంస్థలు 400 mg వరకు ఉపయోగిస్తూ ఉన్నారు. కారణం ఏంటి?పిండిని ఎక్కువ కాలం చెడిపోకుండా కాపాడుకోండి. గోధుమలను నేరుగా కొని సొంతంగా పిండి చేసుకుని తినండి. నిబంధన ప్రకారం పిండి చలికాలంలో 30 రోజులు, వేడిగా ఉన్న రోజుల్లో 20 రోజులు, వర్షాకాలంలో 15 రోజులు తాజాగా ఉంటుంది. అలాంటి పిండినే తినండి, ఆరోగ్యంగా ఉండండి. తెలివిగా ఉండండి. అంతేకాకుండా వీటిని కూడా ప్రయత్నించండి 1.) రాళ్ల ఉప్పు వాడండి, 2.) పిండిని రుబ్బించండి, 3.) కుండలోని నీరు త్రాగండి, ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగండి... సగం వ్యాధుల నుండి బయటపడండి.photo/?fbid=1592551364552509 https://www.facebook.com/
ఈ దావా 2022లో కూడా వైరల్ అయింది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న క్లెయిమ్ లో ఎటువంటి నిజం లేదు. కీటకాలను నివారించడానికి గోధుమ పిండిలో బెంజాయిల్ పెరాక్సైడ్ ను ఉపయోగించరు. ‘Benzoyl peroxide wheat flour’ అనే కీవర్డ్‌లను ఉపయోగించి శోధించినప్పుడు, మేము వెబ్‌సైట్‌లో ఒక కథనాన్ని కనుగొన్నాము. బెంజాయిల్ పెరాక్సైడ్ పిండిలో సహజంగా లభించే కెరోటినాయిడ్లను ఆక్సీకరణం చేస్తుంది, ఇది పసుపు రంగును ఇస్తుంది. ఆక్సిడైజ్డ్ పిండి తెల్లగా ఉంటుంది.పిండిని ఆహారంగా చేసినప్పుడు, బెంజాయిల్ పెరాక్సైడ్‌లో ఎక్కువ భాగం బెంజోయిక్ యాసిడ్‌గా మార్చబడుతుంది, ఇది సాధారణంగా ఉపయోగించే సంరక్షణకారి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం, బెంజాయిల్ పెరాక్సైడ్ క్యాన్సర్ కారకంగా వర్గీకరించబడలేదు.2021లో కూడా ఇదే రకమైన క్లెయిమ్ వైరల్ అయింది, దీనికి ప్రతిస్పందనగా ట్విట్టర్ హ్యాండిల్ ITC కేర్స్ వినియోగదారుల ప్రశ్నలకు సమాధానమిచ్చింది. వారు తయారు చేసిన ఆటాలో బెంజాయిల్ పెరాక్సైడ్‌తో సహా ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు లేదా సంకలనాలు ఉండవని తెలిపారు. చట్టం ప్రకారం నిర్దేశించిన ప్రమాణాలకు లోబడే తాము తయారు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. cfs.gov.hkపలు కంపెనీలు గోధుమ పిండి తయారీలో బెంజాయిల్ పెరాక్సైడ్‌ను అధిక మోతాదులో ఉపయోగిస్తున్నారనే వాదన తప్పు. బెంజాయిల్ పెరాక్సైడ్ ప్యాక్ చేసిన పిండిలో ఉపయోగించడం లేదు. క్లెయిమ్ చేసినట్లుగా ఇది క్యాన్సర్ కారకం కాదు.
Claim : Benzoyl Peroxide is added in packaged wheat flour
Claimed By : Social Media Users
Fact Check : False