ఫ్యాక్ట్ చెక్: పులి తన పిల్లలతో వెళుతున్న వైరల్ వీడియో UPలోని దుధ్వా టైగర్ రిజర్వ్ కు సంబంధించింది

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఒక పులి, దాని పిల్లలతో కలిసి వెళుతున్నట్లు గుర్తించారని చెబుతూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పులి దాని పిల్లలు రోడ్డు మీదకు వచ్చాయి. మూడు పిల్లలు పులి చుట్టూనే తిరుగుతూ కనిపించాయి. తల్లిని అనుసరిస్తూ ఉన్నాయి

Update: 2022-11-26 05:10 GMT

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఒక పులి, దాని పిల్లలతో కలిసి వెళుతున్నట్లు గుర్తించారని చెబుతూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పులి దాని పిల్లలు రోడ్డు మీదకు వచ్చాయి. మూడు పిల్లలు పులి చుట్టూనే తిరుగుతూ కనిపించాయి. తల్లిని అనుసరిస్తూ ఉన్నాయి

అక్కడ ఉన్న వాళ్లు సైలెంట్ గా ఉండిపోయారు. కెమెరాల్లో చిత్రీకరిస్తూ వచ్చారు. వెంటనే ఆ పులి తన పిల్లలతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయింది.
Full View

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా ఉన్నాయి.

మేము వైరల్ వీడియోకు సంబంధించిన కీలక ఫ్రేమ్‌లను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. నవంబర్ 9, 2020న ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి రమేష్ పాండే పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాము. "Brilliant and beautiful capture of tigress with cubs in Dudhwa Tiger Reserve by Field Director," అంటూ అందులో పేర్కొన్నారు.

మేము దుధ్వా టైగర్ రిజర్వ్ గురించి ఇంటర్నెట్ లో శోధించాము. అది ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో సమీపంలో ఉందని కనుగొన్నాము.

మరింత శోధించిన తర్వాత, మేము ఇదే వీడియోని కలిగి ఉన్న ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా నివేదికలను కనుగొన్నాము.

వైరల్ వీడియో, ఒరిజినల్ వీడియోకు సంబంధించిన తేడాలను మేము గుర్తించాం.. రెండూ ఒకేలా ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాం.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను పక్కదోవ పట్టించే విధంగా ఉంది. వీడియో 2020లో ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా టైగర్ రిజర్వ్‌లో కనిపించిన పులికి సంబంధించింది. ఇది మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో చోటు చేసుకున్నది కాదు.
Claim :  Video of a tigress and its cubs spotted in Chhindwara, Madhya Pradesh
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News