ఫ్యాక్ట్ చెక్: విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర సింహం తిరుగుతున్నట్లు వైరల్ వీడియోలో నిజం లేదు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజుల శాకంబరీ దేవి ఉత్సవాలు జూలై 22, 2024న ముగిశాయి. వార్షిక ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజుల శాకంబరీ దేవి ఉత్సవాలు జూలై 22, 2024న ముగిశాయి. వార్షిక ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
శాకంబరీ దేవి అవతారానికి గుర్తుగా అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అలంకరించారు. అయితే గుడిలాంటి నిర్మాణం దగ్గర సింహం సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా విజయవాడలోని ఆలయం సమీపంలో దుర్గామాత వాహనం అయిన సింహం సంచరిస్తోందని యూట్యూబ్ లోని కొన్ని వీడియోలలో తెలిపారు. కొంతమంది వినియోగదారులు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
అమ్మవారి దర్శనం కోసం సింహం ఆలయానికి వచ్చిందంటూ కొందరు యూజర్లు వీడియోను షేర్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
దావా తప్పుదారి పట్టించేది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న సింహం గుజరాత్‌లోని రాజులాలోని లక్ష్మీనారాయణ దేవాలయం సమీపంలో కనిపించింది.
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు. అదే వీడియోని మార్చి 2024లో X వినియోగదారులు సోషల్ మీడియాలో ప్రచురించారని గుర్తించాం. ఆ వీడియోలో రాజులా, గుజరాత్ లోని లక్ష్మీ నారాయణ మందిరం ఆవరణలో సింహం తిరుగుతున్నట్లు ఉందని మేము కనుగొన్నాము.
మరింత సెర్చ్ చేయగా, TV9 గుజరాతీ ప్రచురించిన వీడియో నివేదిక కూడా మాకు కనిపించింది. “Lion spotted near Laxminarayan Temple, Rajula | Amreli | Gujarat | TV9Gujarati” అనే టైటిల్ తో మార్చి 9, 2024న వీడియోను అప్లోడ్ చేశారు.
దివ్యభాస్కర్ కథనం ప్రకారం రాజుల-జఫరాబాద్ ప్రాంతంలో సింహాల సంచారం బాగా పెరిగింది. కోవాయమ లక్ష్మీనారాయణ దేవాలయం దగ్గర సింహం కనిపించింది. కొన్ని సింహాలు ఇక్కడ రోడ్లపై తిరుగుతూ కనిపిస్తాయి. వైరల్ అవుతున్న వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందినది కాదు. గుజరాత్‌లోని రాజులా లక్ష్మీనారాయణ దేవాలయం సమీపంలో చోటు చేసుకున్న ఘటన. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది.
Claim : విజయవాడలోని ప్రముఖ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో సింహం సంచరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది
Claimed By : Youtube Users
Fact Check : Misleading